Daily Zodiac Signs: ఈ రోజు ఈ నాలుగు రాశులే కింగ్ మేకర్స్... ఇందులో మీ రాశి ఉన్నదా?
విశ్కుంభ, ప్రీతియోగంతో పలు రాశుల్లో మార్పులు రాబోతున్నాయి. నాలుగు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉండనున్నాయి. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Daily Zodiac Signs: ఈరోజు అధిక జ్యేష్ఠ మాస బహుళ పక్ష అష్టమి తిథి రాత్రి 03.23 వరకూ తదుపరి నవమి తిథి,శతభిషం నక్షత్రం రా.09.09 వరకూ తదుపరి పూర్వాభాద్ర నక్షత్రం,విశ్కుంభ యోగం ఉదయం 09.28 వరకూ తదుపరి ప్రీతి యోగం, బాలవ కరణం మధ్యాహ్నం 03.29 వరకూ,కౌలవ కరణం రాత్రి 03.23 వరకూ తదుపరి తైతిల కరణం ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం 1.34 గంటల నుంచి మృగశిర కార్తె ప్రారంభం అవుతుంది. అష్టమితిథి, విశ్కుంభ, ప్రీతి యోగం కారణంగా పలు రాశుల్లో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే నాలుగు రాశుల వారికి అత్యంత ప్రీతికరమైన ఫలితాలు, ఒక రాశివారికి వ్యతిరేక ఫలితాలు మిగతా వారికి మధ్యస్థకరమైన ఫలితాలు ఉంటాయి. మరి ఆ నాలుగు రాశుల్లో మీ రాశి కూడా ఉన్నదా లేదా ఒకసారి పరిశీలించుకోండి
మేషరాశి
ఈరోజు కొన్ని వివాదాలు పరిష్కారమౌతాయి. అయితే, అనవసరపు విషయాల్లో జోక్యం చేసుకొని వివాదాలను కొని తెచ్చుకుంటారు. పదిమందికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్తారు. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది.
వృషభరాశి
ఈరోజు ఈరాశివారికి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే, ఆర్థికంగా అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వివాదాలు పరిష్కారమౌతాయి.
మిథునరాశి
ఈరోజు ఈరాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురౌతాయి. ఆలోచించి జాగ్రత్తగా అడుగులు వేయాలి. తప్పనిసరిగా కుటుంబసభ్యుల సలహాలు తీసుకోవాలి. చేపట్టిన పనులను పూర్తిచేస్తారు.
కర్కాటకరాశి
ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. పదిమందిలో మంచిపేరు తెచ్చుకుంటారు. రుణాల నుంచి విముక్తి పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నూతన పెట్టుబడులకు అనుకూలమైన సమయం.
సింహరాశి
ఈరోజు ఈరాశివారు పలు శుభకార్యాల్లో పాల్గొంటారు. సమస్యలు చాలా వరకు పరిష్కరించుకుంటారు. వివాదాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. చేపట్టిన పనులు తప్పకుండా పూర్తిచేస్తారు.
కన్యారాశి
ఈరోజు ఈరాశివారికి అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వివాదాలు కొలిక్కివస్తాయి. అయితే, కొన్ని రకాలైన ఆస్తి వివాదాలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తారు. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొంత ఇబ్బంది పెడతాయి. కోరుకుంటున్న బదిలీలు అవుతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేసుకుంటారు.
తులారాశి
ఈరోజు ఈరాశివారికి అవకాశాలతో పాటు శారీరకంగా కూడా శ్రమ పెరుగుతుంది. చేపట్టిన పనులు ముందుకు సాగేందుకు మరింతగా కష్టపడాల్సి వస్తుంది. చేతికి రావలసిన ధనం సమయానికి అందుతుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
వృశ్చికరాశి
ఈరోజు ఈరాశివారు తీసుకునే తొందరపాటు నిర్ణయాలు వలన ఇబ్బందులకు గురౌతారు. అయితే, గతంలో చేపట్టిన పనులు కొన్ని పూర్తి చేస్తారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి.
ధనూరాశి
ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు కార్యాలయంలో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన కాలం. నూతన పరిచయాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
మకరరాశి
ఈరోజు ఈరాశివారు వీలైనంత వరకు ఈరోజు మౌనంగా ఉండేందుకు ప్రయత్నించాలి. పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. శ్రమ పెరుగుతుంది. అనసవనరమైన వివాదాలను కొనితెచ్చుకుంటారు. అపార్థాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి
ఈరోజు ఈరాశివారికి కొన్ని ఇబ్బందికరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు వస్తాయి. ఇక కీలక నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యులతో చర్చించాలి. శుభవార్తలు వింటారు.
మీనరాశి
ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. నూతన పరిచయాలు పురోభివృద్దికి సహకరిస్తాయి. మీరు అనుకున్నవిధంగా నేడు సాగుతుంది. అవసరమైన సమయానికి ధనం చేతికి అందుతుంది. చేపట్టిన పనులు ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తిచేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
గమనికః ఇక్కడ ఇచ్చిన ఫలితాలు కేవలం సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి పూర్తి ఫలితాలు కావాలంటే నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించండి.




