Daily Horoscope: సెప్టెంబర్‌ 7 రాశిఫలాలు - ఈ రాశుల వారికి కలహాల నుంచి విముక్తి...ఆర్థికంగా విజయం

సెప్టెంబర్‌ సోమవారం రోజున ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కొన్ని రాశులవారికి కలహాల నుంచి విముక్తి లభించడంతో పాటు ఆర్థికంగా కూడా స్థిరత్వం ఏర్పడుతుంది.

Balachander
Published on: 7 Sept 2026 7:43 AM IST
Daily Horoscope: సెప్టెంబర్‌ 7 రాశిఫలాలు - ఈ రాశుల వారికి కలహాల నుంచి విముక్తి...ఆర్థికంగా విజయం
X

Daily Horoscope: సెప్టెంబర్‌ 7న కొన్ని రాశుల వారికి గ్రహస్థితులు ప్రత్యేకంగా అనుకూలించనున్నాయి. ముఖ్యంగా వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, మకరం, కుంభ రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ జీవితం వంటి అంశాల్లో ఆశాజనకమైన పరిణామాలు కనిపిస్తున్నాయి. గత కొంతకాలంగా కొనసాగుతున్న సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. అయితే మిథునం, తుల, ధనుస్సు, మీన రాశుల వారు మాత్రం తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువులో ఈ రోజు శ్రావణ బహుళ ఏకాదశి తిథి సాయంత్రం 5:03 గంటల వరకు ఉంటుంది. అనంతరం ద్వాదశి ప్రారంభమవుతుంది. పునర్వసు నక్షత్రం సాయంత్రం 6:14 గంటల వరకు, ఆ తర్వాత పుష్యమి నక్షత్రం కొనసాగుతుంది. ఉదయం 6:41 వరకు వ్యతీపాత యోగం, అనంతరం వరీయాన్ యోగం రాత్రి 3:38 వరకు ఉండి, ఆ తర్వాత పరిఘ యోగం వస్తుంది. బవ కరణం ఉదయం 6:16 వరకు, బాలవ కరణం సాయంత్రం 5:03 వరకు, ఆ తర్వాత కౌలవ కరణం రాత్రి 3:52 వరకు ఉంటుంది.

మేషరాశి

ఈ రోజు మేష రాశివారు ఏ పని చేపట్టినా ముందుగా దానికి సరైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఉద్యోగంలో మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం వచ్చినా ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత ఒత్తిడిగా అనిపించినా ప్రయత్నం ఆపకండి. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం వద్దు. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

వృషభరాశి

వృషభ రాశికి ఈ రోజు అదృష్టం కలిసొచ్చే రోజు. మీరు చేసే ప్రయత్నాలకు అనుకూల పరిస్థితులు తోడవుతాయి. ఆదాయం పెంచుకునే కొత్త మార్గాలు కనిపించవచ్చు. ఉద్యోగంలో మీ అనుభవానికి తగిన గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో సమయానికి తీసుకునే నిర్ణయాలు లాభాలను అందిస్తాయి. కుటుంబంలో శుభకార్యాల సందడి ఉండొచ్చు.

మిథునరాశి

మిథున రాశివారు ఈ రోజు ప్రతి అడుగులోనూ అప్రమత్తంగా ఉండాలి. కార్యాలయంలో ఉన్నతాధికారులతో మాట్లాడేటప్పుడు మాటతీరు విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారపరమైన కీలక నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. కుటుంబంలో చిన్న విషయాలు పెద్ద వివాదాలుగా మారకుండా ఓర్పు పాటించాలి. అవసరం లేని ఖర్చులు తగ్గించండి.

కర్కాటకరాశి

కర్కాటక రాశివారికి ఈ రోజు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పనిలో పురోగతి సాధ్యమవుతుంది. ఇంటికి సంబంధించిన ఒక శుభవార్త కుటుంబ సభ్యులందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక ఒత్తిడి తగ్గి రుణభారం విషయంలో ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు పూర్తిగా పరిశీలించాలి.

సింహరాశి

సింహ రాశివారికి ఆత్మవిశ్వాసమే ఈ రోజు ప్రధాన బలం. మీరు నిర్ణయించుకున్న పనులను పట్టుదలతో పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో పదోన్నతి లేదా బాధ్యత పెరిగే సూచనలు ఉన్నాయి. ఆస్తి వ్యవహారాల్లో కూడా అనుకూలత కనిపిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి సమయం సహకరిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

కన్యారాశి

కన్య రాశివారికి సెప్టెంబర్‌ 7 అత్యంత అనుకూలమైన రోజుల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఉద్యోగం, వ్యాపారం రెండింటిలోనూ ముందడుగు వేసే అవకాశాలు వస్తాయి. గతంలో ఎదురైన ఆటంకాలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. కెరీర్‌లో కొత్త అవకాశాలు తలుపుతట్టవచ్చు. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత గాఢమవుతుంది.

తులారాశి

తుల రాశివారు ఈ రోజు కొంత సంయమనంతో వ్యవహరించాలి. ఉద్యోగంలో అధికారులతో అనవసర వాదనలకు వెళ్లకండి. వ్యాపారంలో ఒంటరిగా నిర్ణయం తీసుకునే బదులు భాగస్వాములతో చర్చించడం మంచిది. ఆదాయం కంటే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలను సహనంతో పరిష్కరించాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. బంధువులతో చిన్న విషయాలకే విభేదాలు రాకుండా చూసుకోండి.

వృశ్చికరాశి

వృశ్చిక రాశివారికి ఈ రోజు ఆనందకరమైన సంఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉంది. కుటుంబంలో వేడుకలు లేదా శుభకార్యాల వాతావరణం కనిపిస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు పెరుగుతుంది. వ్యాపార ప్రయాణాలు లాభాలను అందించవచ్చు. ఆర్థికంగా మంచి అవకాశాలు ఎదురవుతాయి. స్నేహితులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు.

ధనుస్సురాశి

ధనుస్సు రాశివారు పనిపై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలి. వాయిదా వేసిన పనులు పేరుకుపోకుండా సమయానికి పూర్తి చేయడం మంచిది. కుటుంబ విషయాల్లో మొండితనం కాకుండా సర్దుబాటు ధోరణి అవసరం. కోపంతో మాట్లాడితే పరిస్థితి మీకు వ్యతిరేకంగా మారవచ్చు. అనవసర చర్చలు, వాదనలకు దూరంగా ఉండండి. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి.

మకరరాశి

మకర రాశివారికి గురుబలం అనుకూలంగా ఉండటంతో ఈ రోజు పనులు సులభంగా పూర్తయ్యే అవకాశం ఉంది. లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఉన్న అడ్డంకులు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో మాత్రం జాగ్రత్త అవసరం. కుటుంబంలో ఒక శుభవార్త సంతోషాన్ని తీసుకురావచ్చు. సన్నిహితులతో కలిసి బయటకు వెళ్లే అవకాశం ఉంటుంది.

కుంభరాశి

కుంభ రాశివారికి ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి సాధించే సూచనలు బలంగా ఉన్నాయి. ధనలాభం కలిగించే అవకాశాలు ఎదురుకావచ్చు. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. సన్నిహితులతో విందు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

మీనరాశి

మీన రాశివారు ఈ రోజు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండాలి. ప్రారంభించిన పనులు అనుకున్న వేగంతో ముందుకు సాగకపోవచ్చు. ఉద్యోగంలో నిరుత్సాహానికి లోనుకాకుండా శ్రమిస్తే ఫలితం ఉంటుంది. డబ్బు విషయంలో ముందుచూపు చాలా అవసరం. ఒక వ్యవహారంలో ఆర్థిక నష్టం కలిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. అవసరం లేని ప్రయాణాలు, ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశుల ఫలితాలు కేవలం సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story