Daily Horoscope: ఈ రాశులవారిదే రాజయోగం...ఈ పరిహారంతో ప్రశంసలు ఖాయం

సిద్ధ యోగం, బాలవ కరణాల కలయికతో కూడిన ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

Balachander
Published on: 6 May 2026 7:53 AM IST
Daily Horoscope:  ఈ రాశులవారిదే రాజయోగం...ఈ పరిహారంతో ప్రశంసలు ఖాయం
X

Daily Horoscope: ఈరోజు వైశాఖ మాస బహుళ పక్ష చతుర్థి. ఉదయం 07:51 వరకు చతుర్థి తిథి ఉండి, ఆ తర్వాత పంచమి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 03:54 వరకు మూల నక్షత్రం, అనంతరం పూర్వాషాఢ నక్షత్రం ప్రవేశిస్తాయి. సిద్ధ యోగం, బాలవ కరణాల కలయికతో కూడిన ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎవరి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఆర్థికంగా కొంత అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా ఒడిదుడుకులు ఎదురుకావొచ్చు. మీ వెనుక ఉన్న అనుభవజ్ఞుల మాట వినడం వల్ల పెద్ద ప్రమాదం తప్పుతుంది. ఆరోగ్య విషయంలో అజాగ్రత్త వద్దు. ఈరోజు ఈరాశివారు సూర్య భగవానుడిని స్మరిస్తూ 'ఆదిత్య హృదయం' పఠిస్తే మనోబలం పెరుగుతుంది.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. నూతనోత్సాహంతో పనిచేస్తారు. చేసే ప్రతి పనిలోనూ స్పష్టత ఉంటుంది. ముఖ్యంగా సొంత నిర్ణయాలు మీకు లాభాలను తెచ్చిపెడతాయి. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలు జరుగుతాయి. ఈరోజు ఈరాశివారు లక్ష్మీ గణపతి ఆరాధన వల్ల ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుంది.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజు ఇది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. నూతన వస్తువుల కొనుగోలు సూచనలు ఉన్నాయి. కుటుంబంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆశీస్సులు లభిస్తాయి. గతంలో పడ్డ శ్రమ ఇప్పుడు ఫలించే అవకాశం ఉంది. ఆదాయానికి మించిన ఖర్చులు లేకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఈరోజు ఈరాశివారు విష్ణు సహస్రనామ పారాయణ వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. గురుబలం తోడవుతోంది. క్లిష్టమైన సమస్యలను కూడా చిరునవ్వుతో పరిష్కరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఆత్మసంతృప్తి లభిస్తుంది. ఊహించని ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. ఈరోజు ఈరాశివారు ఇష్టదైవారాధన చేయాలి.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉంటాయి. వృత్తి పరంగా బాగున్నా, ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఆస్తి తగాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈరాశివారు హనుమాన్ చాలీసా లేదా దండకం పఠించడం వల్ల శత్రు బాధలు తొలగుతాయి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఆలోచనలు మిమ్మల్ని ఉన్నత స్థానంలో నిలబెడతాయి. విదేశీ యత్నాలు ఫలించవచ్చు. తీర్థయాత్రల పట్ల ఆసక్తి చూపిస్తారు. అధికారుల అనుగ్రహంతో అధికార యోగం పడుతుంది. విదేశాల నుంచి శుభవార్త అందుకుంటారు. ఈరోజు ఈరాశివారు వేంకటేశ్వర స్వామి దర్శనం వల్ల సర్వ శుభాలు కలుగుతాయి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టి ముందుకు సాగాలి. మీ గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో పవిత్ర పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మేలు చేస్తుంది.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. దేవుని అనుగ్రహం ఉన్నప్పటికీ, మీ వైపు నుంచి ప్రయత్నం లోపించకూడదు. అనవసర ఆందోళనలు వదిలిపెట్టి పనిపై దృష్టి పెట్టండి. ఈరోజు ఈరాశివారు హనుమంతుని ఆరాధన చేయాలి. ఆంజనేయుని ఆరాధనతో మీలో ఉన్న భయం పోయి ధైర్యం పెరుగుతుంది.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ మీ సంపద విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి, కాబట్టి ఆహార నియమాలు పాటించండి. ఈరోజు ఈరాశివారు సూర్య నమస్కారాలు చేయడం శ్రేయస్కరం.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి. మీ ఆత్మీయులతో గడిపే సమయం మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. సమాజంలో మంచి ప్రజాదరణ లభిస్తుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయడం శుభకరం.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా వెనకడుగు వేయకండి. ప్రయాణాల సమయంలో అప్రమత్తత తప్పనిసరి. ఈరోజు ఈరాశివారు శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత, కార్యజయం కలుగుతాయి.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం జ్యోతిష్యనిపుణులను సంప్రదించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story