Daily Astrology: జులై 4 రాశిఫలాలు - ఈ రాశుల వారు జాగ్రత్తలు పాటిస్తేనే అదృష్టం

ఈరోజు ద్వాదశ రాశుల విషయంలో ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం. ఉద్యోగం వ్యాపారం కలిసి వస్తుందో రాదో తెలుసుకుందాం.

Balachander
Published on: 4 July 2026 7:29 AM IST
Daily Astrology:  జులై 4 రాశిఫలాలు - ఈ రాశుల వారు జాగ్రత్తలు పాటిస్తేనే అదృష్టం
X

Daily Astrology: జులై 4 జ్యేష్ఠమాసం బహుళపక్ష చవితి. ధనిష్ఠ నక్షత్రం ప్రీతియోగం ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా ఉంటుంది. అయితే, చాలా రాశులవారి జాతక ఫలితాలు ఈరోజు కొంత ఇబ్బంది కరంగానే ఉన్నాయి. జాగ్రత్తలు ఉండాల్సి ఉంటుంది. వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. మీ చుట్టూ కొత్తవారు చేరుతారు. వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని పనిచేయనివ్వకుండా అడ్డంకులు కలుగుతాయి. ఉత్సాహంగా ఉండేందుకు ప్రయత్నించాలి. కొన్ని శుభవార్తలు వింటారు.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఎలాంటి ఆదాయం లేకుండానే ఖర్చులు పెరుగుతాయి. మీ చుట్టు మిమ్మల్ని ప్రలోభ పెట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మౌనమే అన్నింటికి సమాధానం.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. రోజువారి కార్యక్రమాల్లో అడ్డంకులు ఏర్పడవచ్చు. ఆటంకాలు ఎదురౌతాయి. రుణ ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తారు. అయితే, అధికారులతో మీ సత్సంబంధాలు కొనసాగుతాయి. ఒత్తిడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఈరోజు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్నా చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. పూర్తి చేసేందుకు పట్టుదలతో ప్రయత్నిస్తారు. అయితే, ఇతరులు అప్పగించిన బాధ్యత కంటే మరింత బాధ్యతను చేపట్టి ఇబ్బందులు పడతారు. స్నేహితులను కలుసుకుంటారు. మాట అదుపులో ఉంచుకోవాలి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. మొండిపట్టుదలతో చేపట్టిన పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. బకాయిలు వసూలు కావొచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకోవచ్చు.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులను నిదానంగా పూర్తిచేస్తారు. వాహనాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఆలోచించి తీసుకోవాలి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా సమస్యలు చాలా వరకు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తవచ్చు. పెట్టుబడులకు అనుకూలమైన సమయం కాదు.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కొన్ని నిర్ణయాల కారణంగా మీరు ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తొందరపడొద్దు. ఉద్యోగాల్లో మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కొత్త ఒప్పందాలతో పనులు ముందుకు సాగుతాయి.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఆర్థికంగా కాస్త పర్వాలేదనిపిస్తుంది. మానసికంగా ధైర్యంగా ఉండాలి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. నిర్ణయాలను ఆలోచించి తీసుకోవాలి.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకూడదు. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. బాల్యస్నేహితులను కలుసుకుంటారు. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. మీరు ఎంత ఓర్పుతో ఉన్నప్పటికీ కొన్ని విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. కుటుంబ సభ్యుల సలహాలను తప్పనిసరిగా పాటించాలి. మాట జారే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. నూతన ఒప్పందాలకు అనుకూలం.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. రుణాల కోసం చేసే ప్రయత్నిలు ఫలించకపోవచ్చు. ఒప్పందాలకు దూరంగా ఉండాలి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన రాశి ఫలితాలు మాత్రమే. పూర్తిస్థాయి జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story