Guru Gochar 2026: జూన్ 2 నుంచి ఈ రాశుల వారి రాత మారనుంది.. కర్కాటక రాశిలోకి గురు ప్రవేశం
Guru Gochar 2026: జ్యోతిష్యంలో గురుగ్రహాన్ని అదృష్టం, ధనం, విద్య, వివాహం, జ్ఞానం వంటి అంశాలకు కారకుడిగా భావిస్తారు.
Guru Gochar 2026: జూన్ 2 నుంచి ఈ రాశుల వారి రాత మారనుంది.. కర్కాటక రాశిలోకి గురు ప్రవేశం
Guru Gochar 2026: జ్యోతిష్యంలో గురుగ్రహాన్ని అదృష్టం, ధనం, విద్య, వివాహం, జ్ఞానం వంటి అంశాలకు కారకుడిగా భావిస్తారు. గురుడు సాధారణంగా సుమారు 13 నెలలకు ఒకసారి రాశి మారుతుంటాడు. వచ్చే జూన్ 2న గురుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు.
కర్కాటక రాశిలో గురు ప్రవేశం ఎందుకు ప్రత్యేకం?
కర్కాటక రాశిలో గురుడు అత్యంత శుభ ఫలితాలు ఇస్తాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో కెరీర్, డబ్బు, కుటుంబం, విద్య, వివాహం వంటి విషయాల్లో మంచి మార్పులు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా కాలంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం లభించే సూచనలు ఉన్నాయి.
మిథున రాశి వారికి ఆర్థికంగా గోల్డెన్ టైమ్
మిథున రాశి వారికి ఈ గురు గోచారం వల్ల ఆర్థిక పరిస్థితి బలపడే అవకాశం ఉంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకోవచ్చు. ఊహించని విధంగా డబ్బు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి రాబడులు ఇవ్వొచ్చు. సరైన ప్లానింగ్‌తో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో పెద్ద లాభాలు పొందే అవకాశం ఉంది.
మేష రాశి వారికి ఉద్యోగం, విదేశీ అవకాశాలు
మేష రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలంగా ఉండొచ్చు. ఉద్యోగ ఇంటర్వ్యూల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ సహాయం లేదా ప్రభుత్వ రంగం ద్వారా ఆర్థిక లాభం కలగొచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి మంచి పరిచయాలు ఏర్పడి కెరీర్‌లో ఉపయోగపడవచ్చు. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగ అవకాశాలు కూడా రావచ్చు.
సింహ రాశికి రాజయోగం.. ఆదాయం పెరిగే ఛాన్స్
సింహ రాశి వారికి గురుగ్రహం రాజయోగం తీసుకురావచ్చని భావిస్తున్నారు. నాయకత్వ లక్షణాలు బయటపడే సమయం ఇది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కీలక బాధ్యతలు రావచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరగడంతో ఆర్థిక పరిస్థితి మరింత బలపడే అవకాశం ఉంది.
మీన రాశి వారికి వివాహం, కుటుంబంలో శుభవార్తలు
మీన రాశి వారికి ఈ గురు గోచారం మానసిక ప్రశాంతతను ఇవ్వొచ్చు. చాలా కాలంగా ఉన్న టెన్షన్ తగ్గే సూచనలు ఉన్నాయి. వివాహంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోయే అవకాశం ఉంది. మంచి సంబంధాలు రావచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి.
గమనిక: పైన తెలిపిన వివరాలను ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం, పలువురు పండితులు తెలిపిన విషయాల ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.




