Astrology: రాశిఫలాలు - ఈ ఐదు రాశులకు అదృష్టయోగం..శుక్రవారం లక్ష్మీకటాక్షం

ఈరోజు ఈ ఐదు రాశులకు అదృష్టయోగం ఉండనుండగా...మిగిలిన రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకుందాం.

Balachander
Published on: 19 Jun 2026 7:51 AM IST
Astrology: రాశిఫలాలు - ఈ ఐదు రాశులకు అదృష్టయోగం..శుక్రవారం లక్ష్మీకటాక్షం
X

Astrology: శుక్రవారం లక్ష్మీ కటాక్షంతో ఐదు రాశుల వారికి అదృష్టయోగం కలగనుంది. బుధాధిత్య యోగం ప్రభావం ఈ రాశులపై స్పష్టంగా కనిపించబోతున్నది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొననున్నది. మరి ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారు చేపట్టిన పనులను నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలు చేస్తారు. తోటివారి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. రుణబాధల నుంచి బయటపడతారు. వివాదాలు సద్దుమణుగుతాయి. బాధ్యతలను స్వీకరిస్తారు. పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు సహకారం లభిస్తుంది. వివాదాల నుంచి బయటపడతారు. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. సమాచంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. నూతన పరిచయాలు లాభిస్తాయి. అవసరానికి ధనం చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకావాలు ఉన్నాయి. వివాదాలు పరిష్కారమౌతాయి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా పూర్తిచేస్తారు. అనుకున్న సమయానికి అనుకున్న విధంగా ధనం చేతికి అందుతుంది. మీ చుట్టూ ఉన్నవాళ్లు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. విధినిర్వహణలో మీకు సహకరించేవారు ఉంటారు. నూతన కార్యక్రమాలను చేపడతారు.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసకుంటారు. తెలివిని పెట్టుబడిగా పెట్టి వ్యాపారాలు చేస్తారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. నూతన కాంట్రాక్టులను సొంతం చేసుకుంటారు. కుటుంబంలో మీ నిర్ణయానికి అనుకూలత పెరుగుతుంది. స్నేహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. పనులు ముందుకు సాగుతాయి. ఉద్యోగులకు అనుకూలంగం ఉంది. వివాదాలు పరిష్కారమౌతాయి. కీలక సమాచారం అందుకుంటారు.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీరు చేపట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఒత్తిళ్లు తొలగిపోతాయి. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన అవకాశాలున్నాయి. పనిభారం తగ్గుతుంది. ప్రతిఫలం లభిస్తుంది.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. భూములు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తారు. చాలా వరకు సమస్యల నుంచి బయటపడతారు. మీరు వదిలేసుకున్న ధనం తిరిగి చేతికి అందుతుంది. శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత వ్యతిరేకంగా ఉన్నాయి. ఈరోజు ఆటంకాలను ఎదుర్కోవలసి వస్తుంది. వివాదాలు చుట్టుముడతాయి. అకారణంగా మాటపడాల్సి వస్తుంది. చేపట్టిన పనులు ముందుకు సాగే అవకాశాలు లేవు. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. బాధ్యతలు పెరుగుతాయి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. కొత్త ఆలోచనలు చేస్తారు. అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. పనులు ముందుకు సాగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తారు. శతృవులపై విజయం సాధిస్తారు.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలితాలు సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాలు కావాలంటే నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story