Dream: కలలో కోతులు కనిపించాయా.? మీ జీవితంలో జరగబోయేది ఇదే!
Dream: కలలు ప్రతి ఒక్కరికీ సహజంగా వస్తుంటాయి. కొన్ని కలలు మనసులో ముద్ర వేస్తే, మరికొన్ని కలల వెనుక ఏదైనా సంకేతం ఉందా అనే ఆలోచన కలిగిస్తాయి.
Dream: కలలో కోతులు కనిపించాయా.? మీ జీవితంలో జరగబోయేది ఇదే!
Dream: కలలు ప్రతి ఒక్కరికీ సహజంగా వస్తుంటాయి. కొన్ని కలలు మనసులో ముద్ర వేస్తే, మరికొన్ని కలల వెనుక ఏదైనా సంకేతం ఉందా అనే ఆలోచన కలిగిస్తాయి. ముఖ్యంగా కలలో జంతువులు కనిపిస్తే వాటికి ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. అందులో కోతి కలలో కనిపించడాన్ని కూడా ప్రత్యేకమైనదిగానే పరిగణిస్తారు. కలలో కోతి కనిపిస్తే దాని అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం.
కలలో సాధారణంగా కోతి కనిపిస్తే..
కలలో ప్రశాంతంగా ఉన్న కోతి కనిపించడం సాధారణంగా శుభ సూచకంగా భావిస్తారు. ఇలాంటి కల జీవితంలో కొత్త పరిణామాలకు సంకేతంగా ఉంటుందని స్వప్న శాస్త్ర విశ్వాసం. చాలాకాలంగా ఎదురుచూస్తున్న పని ముందుకు సాగడం, ఊహించని విధంగా మంచి వార్త అందడం లేదా కొత్త అవకాశం లభించడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని చెబుతారు. అలాగే హనుమంతుడి ఆశీస్సులు లభిస్తున్నాయని భావించే వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా ఏదైనా కష్ట సమయంలో ఇలాంటి కల వస్తే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం పెరుగుతుందని కొందరు నమ్ముతారు.
కోతి కోపంగా కనిపిస్తే ఏం సూచిస్తుంది?
కలలో కోతి చాలా కోపంగా ఉండటం లేదా మనపై దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించడం అంత శుభ సంకేతంగా భావించరు. స్వప్న శాస్త్రం ప్రకారం ఇలాంటి కలలు మన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, వివాదాలు లేదా సంబంధాల్లో ఏర్పడే అపార్థాలకు సూచనగా చెబుతారు.
ఎవరితోనైనా మాట పట్టింపులు రావడం, చిన్న విషయాలు పెద్ద సమస్యగా మారడం లేదా మనసులో ఉన్న అసంతృప్తి బయటపడటం వంటి పరిస్థితులు ఎదురుకావచ్చని నమ్మకం. కొన్నిసార్లు మనలో ఉన్న కోపం, ఆందోళన, భయం కూడా ఇలాంటి కలలకు కారణం కావచ్చు. అందుకే ఇలాంటి కల వచ్చినప్పుడు భయపడకుండా చుట్టూ ఉన్న పరిస్థితులను ప్రశాంతంగా గమనించడం మంచిది.
కోతి ఆహారం తింటున్నట్లు కనిపిస్తే..
కలలో కోతి ఆహారం తింటున్న దృశ్యం కనిపిస్తే దానిని స్వప్న శాస్త్రంలో కొంత ప్రతికూల సంకేతంగా భావిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరమని, అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలని సూచించే కలగా కొందరు భావిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ కల సూచిస్తుందని నమ్ముతారు. రాబోయే రోజుల్లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని స్వప్న శాస్త్ర విశ్వాసం చెబుతుంది.
సంతోషంగా ఉన్న కోతి లేదా గుంపుగా కోతులు కనిపిస్తే..
కలలో కోతి సంతోషంగా, ప్రశాంతంగా కనిపిస్తే దీనిని శుభ పరిణామాలకు సంకేతంగా భావిస్తారు. గతంలో మనతో విభేదించిన వ్యక్తులతో మళ్లీ సంబంధాలు మెరుగుపడటం, పాత స్నేహితులను కలుసుకోవడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని నమ్మకం. అలాగే సమాజంలో గౌరవం పెరగడం, మన ప్రయత్నాలకు గుర్తింపు రావడం వంటి మంచి ఫలితాలకు ఇది సంకేతమని స్వప్న శాస్త్రంలో చెబుతారు.
ఇక కలలో ఒకటి కాదు.. చాలా కోతులు గుంపుగా కనిపిస్తే కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుందని కొందరు విశ్వసిస్తారు. కుటుంబంలో ఐక్యత పెరగడం, ఆర్థికంగా మంచి అవకాశాలు రావడం, అందరూ కలిసి సంతోషంగా ఉండడం వంటి పరిణామాలకు ఇది సంకేతమని చెబుతారు.
గమనిక: కలలకు సంబంధించిన ఫలితాలు స్వప్న శాస్త్రం, జ్యోతిష్య విశ్వాసాలపై ఆధారపడినవే. వీటికి శాస్త్రీయంగా నిర్ధారిత ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.




