Daily Astrology: జులై 1 రాశిఫలాలు ... ఈ రాశులు అదృష్టానికి సంకేతాలు

ఐంద్ర యోగం పలు రాశులపై అనుకూల ఫలితాలను ఇవ్వనున్నది. ద్వాదశ రాశుల జీవితాల్లో మార్పులు తీసుకురాబోతున్నది. గ్రహాల ఆధారంగా ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Balachander
Published on: 1 July 2026 7:08 AM IST
Daily Astrology: జులై 1 రాశిఫలాలు ... ఈ రాశులు అదృష్టానికి సంకేతాలు
X

Daily Astrology: సమయం ఎప్పుడూ ఎవరికీ ఒకేలా ఉండదు. అది నిరంతరం మారుతూనే ఉంటుంది. గ్రహ గమనాల ఆధారంగానే మన జీవనం, జాతకం ఆధారపడి ఉంటాయి. ఇక జులై 1, బుధవారం బహుళ పాడ్యమి. పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. అంతేకాదు, ఐంద్రయోగం సాయంత్రం వరకు ఆ తరువాత వైదృతి యోగం ఏర్పడుతుంది. ఈ గ్రహ గమనాలు, యోగాల ప్రభావం ద్వాదశ రాశులపై స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, వృత్తి, వ్యాపారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎవరికి లాభం ఉంటుందో ఎవరికి కష్టాలు ఉంటాయో తెలుసుకుందాం.

మేషరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. విందులు వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులు శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. పొదుపుకోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. మీకు అత్యంత సన్నిహితంగా ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బందులు పెడతారు.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సమావేశాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. చర్చల్లో చురుగ్గా పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాల్లో సృజనాత్మకంగా ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడుపుతారు.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో సన్నిహితుల సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహంగా ఉంటుంది. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. మాటకు విలువ పెరుగుతుంది.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు విస్తరిస్తాయి. విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. వేడుకల్లో పాల్గొనేందుకు ఆసక్తి కనబరుస్తారు. బ్యాంకింగ్‌ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యుల కోసం విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆర్థికంగా సమీక్షలకు అనుకూలంగా ఉంటుంది. బాల్యమిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. పెట్టుబడులు విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. విద్యకు అవసరమైన నిధులు సర్థుబాటవుతాయి. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. రహస్య సమాచారం మిమ్మల్ని కలవరానికి గురిచేస్తుంది. ఆర్థిక విషయాలు ఇబ్బందులు కలిగిస్తాయి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రయాణాలు చేసేందుకు అనుకూలం. ఉన్నత విద్యకోసం అవసరమైన నిధులు సర్థుబాటవుతాయి. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. గతంలో చేసిన పనులకు సంబంధించి పారితోషికాలు అందుకుంటారు. లక్ష్యాలు సాధించేందుకు గత అనుభవాలు ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవహారాల్లో అంచనాలు తప్పే అవకాశం ఉంది.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సమావేశాల్లో కీలక పాత్రను పోషిస్తారు. చర్చలు అనుకూలంగా ఉంటాయి. న్యాయ, రక్షణ రంగాల వారికి ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యారంగంలోని వారికి అనుకూలం. వేడుకల్లో పెద్దలను కలుసుకుంటారు.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన బంధువులను కలుసుకుంటారు. విందు వినోదాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. కొత్త పనులు చేపట్టేందుకు ఆసక్తికనబరుస్తారు. బోధనా రంగంలోని వారికి అనుకూలం.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలం. ఖర్చులు పెరుగుతాయి. ఆదాయం కోసం కొత్త ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్నయాలు తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులను వాయిదా వేయడం ఉత్తమం.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలకు అవసరమైన నిధులు సర్థుబాటవుతాయి. రవాణా, స్టేషనరీ రంగాల వారికి ఆర్థికంగా నిరాశ ఎదురౌతుంది.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సమావేశాల్లో పాల్గొంటారు. చర్చలు కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. వేడుకల్లో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతారు. నూతన కాంట్రాక్టులు చేపడతారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.

గమనికః ఇక్కడ ఇచ్చినవి కేవలం సామాన్యమైన రాశి ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఫలితాలు పొందాలంటే నిపుణులైన జ్యోతిష్యపండితులను సంప్రదించాలి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story