Daily Horoscope: చంద్రుడి సంచారంతో మారిపోనున్న జాతకాలు.. వీరికి పండుగే..!
Daily Horoscope: ఏప్రిల్ 3, 2026 శుక్రవారం నాటి ద్వాదశ రాశి ఫలాలు , పంచాంగం మీ కోసం.
Daily Horoscope
Daily Horoscope: ఏప్రిల్ 3, 2026 శుక్రవారం నాటి ద్వాదశ రాశి ఫలాలు ,పంచాంగం మీ కోసం. మేషం నుంచి మీనం వరకు ఏ రాశి వారికి ధనలాభం కలుగుతుంది? ఎవరికి ప్రయాణ సూచనలు ఉన్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
మేషం
చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు, వాహన నడకలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సంతానంతో స్వల్ప విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి.
వృషభం
అన్ని రంగాల వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభం, కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మిథునం
నూతన పరిచయాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే, కుటుంబ సభ్యుల నుంచి స్వల్ప వ్యతిరేకత ఎదురుకావచ్చు.
కర్కాటకం
ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో మాటపట్టింపులు రావచ్చు. ఉద్యోగస్తులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం శ్రేయస్కరం.
సింహం
ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. దాయాదులతో ఉన్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.
కన్య
ధన వ్యవహారాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాలు అధికమవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. సహనం పాటించడం ముఖ్యం.
తుల
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
వృశ్చికం
చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సోదరులతో ఉన్న వివాదాలు పరిష్కారమై నూతన ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అధికారుల ఆదరణ లభిస్తుంది.
ధనుస్సు
ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుంది.
మకరం
ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. రాజకీయం మరియు క్రీడా రంగాల వారికి ఉత్సాహకరంగా ఉంటుంది. స్త్రీలకు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించడం మంచిది.
కుంభం
మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
మీనం
వృత్తి, ఉద్యోగ రంగాల్లో మార్పులు లేదా స్థానచలన సూచనలు ఉన్నాయి. అనవసర భయాందోళనలు వీడటం మంచిది. ఆర్థిక పరిస్థితిలో స్వల్ప మార్పులు ఉంటాయి. మిత్రుల సహకారం కొంత ఆలస్యంగా అందుతుంది.
గమనిక: ఇవి జ్యోతిష్య శాస్త్రం మరియు గ్రహగతుల ఆధారంగా అందించిన ఫలితాలు. వ్యక్తిగత జాతక చక్రాల ఆధారంగా ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు.




