Daily Horoscope: రాశిఫలాలు - ఈరోజు ఈ ఏడు రాశులవారు అదృష్టవంతులు - పట్టిందల్లా బంగారమే

Daily Horoscope: సహనం, సమయస్ఫూర్తి, భక్తి ఉంటే విజయాలు తప్పక వరిస్తాయని ఈరోజు గ్రహస్థితులు తెలియజేస్తున్నాయి.

Balachander
Published on: 25 April 2026 7:49 AM IST
Daily Horoscope
X

Daily Horoscope: రాశిఫలాలు - ఈరోజు ఈ ఏడు రాశులవారు అదృష్టవంతులు - పట్టిందల్లా బంగారమే

Daily Horoscope April 25 2026: సహనం, సమయస్ఫూర్తి, భక్తి ఉంటే విజయాలు తప్పక వరిస్తాయని ఈరోజు గ్రహస్థితులు తెలియజేస్తున్నాయి. నవమి తిథి సా.06.27 వరకు ఉండి, తరువాత దశమి ప్రారంభమవుతుంది. ఆశ్లేష నక్షత్రం రా.08.04 వరకు ఉండి తరువాత మఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. గండ యోగం రా.11.43 వరకు ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వృద్ధి యోగం ప్రారంభమవ్వడం శుభ సంకేతం. ఈరోజు మొత్తం 12 రాశులలో కనీసం 7 రాశులకు శుభఫలితాలు కనిపిస్తుండటం విశేషం. మరి శుభఫలితాలు ఉన్న రాశులేవో.. జాగ్రత్తగా ఉండవలసిన రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

మేషరాశి

ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. ఈరోజు ఈరాశివారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్తును బంగారుబాట చేసుకుంటారు. ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో సమస్యలు ఎదురైనా తెలవిగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు. ఈరోజు ఈరాశివారు శివారాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. అధికారుల ప్రశంసలు మీకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. ఆరోగ్యంపై మాత్రం కొంత శ్రద్ధ అవసరం.ఈరోజు ఈరాశివారు శ్రీ మహాలక్ష్మిని ఆరాధించడం శుభప్రదం.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. పనులు ఆలస్యంగా సాగినా నిరుత్సాహ పడకండి. ఖర్చులు నియంత్రిస్తే మంచిది. కుటుంబంలో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. ఈరోజు ఈరాశివారు సూర్యారాధన చేయడం ద్వారా ఉత్సాహం పెరుగుతుంది.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఈరోజు మీరు చేపట్టిన కొన్ని పనులు సులభంగా పూర్తవుతాయి, మరికొన్ని ఆలస్యం అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. డబ్బు సంబంధిత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు నవగ్రహ స్తోత్రం పఠిస్తే ఉపశమనం కలుగుతుంది.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. కుటుంబంలో ఆనందకరమైన వార్త వినే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పారాయణం మరింత శక్తిని ఇస్తుంది.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. అన్ని రంగాల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి మార్గం సిద్ధమవుతుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈరోజు ఈరాశివారు కులదేవతలను ఆరాధించడం శ్రేయస్కరం.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు తప్పులు చేయించవచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు ఈరాశివారు హనుమంతుడిని ఆరాధించడం మంచిది.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు సాధారణంగా ఉన్నాయి. పనుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది. ధనవ్యయం పెరగవచ్చు. సమయపాలన పాటిస్తే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ప్రణాళికలతో ముందుకు సాగాలి. ఈరోజు ఈరాశివారు ఈశ్వరుని ఆరాధన శుభప్రదం.

ధనుస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. నూతన అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులను నియంత్రించుకోవాలి. ఆనారోగ్య సమస్యలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించడం శ్రేయస్కరం.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలాన్ని ఇస్తుంది. పెట్టుబడులు లాభిస్తాయి. విహార యాత్రలు చేసే అవకాశం ఉంది. ఈరోజు ఈరాశివారు కనకధారా స్తోత్రం పఠించడం మంచిది.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. రుణభారం తగ్గుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఈరోజు ఈరాశివారు కులదేవతల ఆరాధన చేయడం మంచిది.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థికంగా మంచి పురోగతి ఉంటుంది. విదేశీ అవకాశాలు కలిసివస్తాయి. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఈరోజు ఈరాశివారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం శ్రేయస్కరం.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశిఫలాలు సాధారణ ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత గ్రహస్థితులు, జాతకం రిత్యా ఫలితాలు మారుతుంటాయి. వ్యక్తిగత జాతకం కోసం జ్యోతిష్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story