Daily Horoscope: ఈ రాశుల వారికి నేడు రాజయోగం...జాతకంలో గ్రహాల స్థితి ఎలా ఉందంటే?

వైశాఖమాసం శుక్లపక్ష ద్వాదశి రోజున 12 రాశుల వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Balachander
Published on: 28 April 2026 9:12 AM IST
Daily Horoscope: ఈ రాశుల వారికి నేడు రాజయోగం...జాతకంలో గ్రహాల స్థితి ఎలా ఉందంటే?
X

Daily Horoscope: ఈరోజు వైశాఖమాసం శుక్లపక్షం ద్వాదశి తిథి. సాయంత్రం 6:51 వరకు ద్వాదశి ప్రభావం కొనసాగి, అనంతరం త్రయోదశి ప్రారంభమవుతుంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం రాత్రి 10:36 వరకు ఉండి, తర్వాత హస్త నక్షత్రం ప్రవేశిస్తుంది. వ్యాఘాత యోగం నుండి హర్షణ యోగానికి మార్పు జరగడం వల్ల ఈ రోజు జీవితం లోని కఠినతలు తొలగి, సంతోషానికి మార్గం తెరుచుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పండితుల చెప్పిన ప్రకారం ఈ రోజు విష్ణు ప్రార్థన, దానం, ఉపవాసం చేస్తే 12 రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. ఇటువంటి పవిత్ర దినంలో ప్రతి రాశికి వచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఎవరి జాతకం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం.

మేషరాశి

రాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో ప్రయోషన్లు రావొచ్చు. వ్యాపారులకు పెట్టుబుడులు అనుకూలిస్తాయి. నూతన పరిచయాలు లాభిసత్ఆయి. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కుటుంబ సభ్యులో ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మని ఆరాధించాలి.

వృషభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. సానుకూల శక్తులు మీ చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో 20 శాతం వరకు లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమావేశాల్లో మీ ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఆస్తి సంబంధిత వ్యవహారాల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు ఈరాశివారు దక్షిణామూర్తిని ఆరాధించాలి.

మిథునరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురవుతాయి. కోపం 50 శాతం వరకు తగ్గిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది. ప్రయాణాలను వాయిదా వేయడం ఉత్తమం ఈరోజు ఈరాశివారు హనుమాన్‌ చాలీసా పఠించాలి.

కర్కాటకరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అయితే ఖర్చులు 30% వరకు పెరిగే అవకాశం ఉంది. అందుకే ఆర్థిక నియంత్రణ అవసరం. కుటుంబంలో సౌహార్ద వాతావరణం కొనసాగాలంటే మాటల్లో జాగ్రత్త అవసరం. వివాదాలకు దూరంగా ఉండాలి. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ఈరోజు ఈరాశివారు సూర్యనారాయణుడిని ఆరాధించాలి.

సింహరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. దైవ అనుగ్రహం మీకు అండగా ఉంది. ముఖ్యంగా స్థిరాస్తి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు మీకు రెండు రెట్లు లాభం ఇస్తాయి. ఆరోగ్యంపై మాత్రం కొద్దిగా శ్రద్ధ పెట్టాలి. చేపట్టిన పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు తగ్గించుకోవాలి. ఈరోజు ఈరాశివారు హనుమాన్‌ ఆలయం దర్శించడం శుభప్రదం.

కన్యారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ప్రారంభించిన ప్రతి పని విజయవంతమవుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు 70 శాతం వరకు కనిపిస్తున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. స్నేహితులతో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఈరోజు ఈరాశివారు కులదేవతారాధన చేయాలి.

తులారాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. సహనంతో వ్యవహరించాలి. కోపంలో నిర్ణయాలు తీసుకోకూడదు. సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. న్యాయపరమైన విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబంలో కలహాలు రావొచ్చు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి. ఈరోజు ఈరాశివారు సుబ్రహ్మణ్యుడిని ఆరాధించాలి.

వృశ్చికరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభించే రోజు ఇది. ఉద్యోగంలో ప్రశంసలు అందుకుంటారు. ఆదాయం 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఈరోజు మహాశివుడిని ఆరాధించాలి.

ధనస్సురాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు అనుకూలంగా ఉన్నాఇయ. గురు కటాక్షం వల్ల అదృష్టం మీవైపు ఉంటుంది. స్వల్ప శ్రమతోనే పెద్ద విజయాలు సాధిస్తారు. ధనలాభం రెండు రెట్లు పెరుగుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశముంది. అయితే ఖర్చులు కూడా పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఈరోజు ఈరాశివారు శ్రీమహాలక్ష్మిని ఆరాధించాలి.

మకరరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగంలో కొంత పట్టు సాధిస్తారు. ఆర్థికంగా కొంత వరకు బాగానే ఉంటుంది. ఈరోజు ఈరాశివారు ఆదిత్య హృదయం పఠించాలి.

కుంభరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో లాభాలు ఆర్థిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. వీలైనంత వరకు కోపాన్ని తగ్గించుకోవాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఈరోజు ఈరాశివారు కార్యసిద్ధి హానుమాన్‌ను ఆరాధించాలి.

మీనరాశి

ఈరోజు ఈరాశివారికి ఫలితాలు మధ్యస్థంగా ఉన్నాయి. ఈరోజు ప్రారంభం ప్రతికూతలతో ఆరంభమైనా... ఆ తరువాత మంచి జందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. తీసుకునే నిర్ణయాల కారణంగా మానసిక ప్రశాంతత పొందుతారు. ఈరోజు ఈరాశివారు కులదైవారాధన చేయాలి.

గమనికః ఇక్కడ ఇచ్చిన రాశి ఫలితాలు కేవలం సామాన్యమైనవి మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి జాతక ఫలితాల ఉంటాయి. వీటి కోసం వ్యక్తిగత జ్యోతిష్యుడిని సంప్రదించడం మంచిది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story