Zodiac Signs: ఐంద్ర, వైధృతి యోగం...ఈ రాశులవారికి కష్టాలు...ప్రేమికులకు అనుకూలం

ఐంద్ర, వైధృతి యోగం ప్రభావంతో ద్వాదశ రాశుల ఫలితాలు ... కొన్ని రాశులకు ఒత్తిడి, ప్రయాణ ఇబ్బందులు ఉండగా, ప్రేమికులు, విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి.

Balachander
Published on: 6 Jun 2026 7:38 AM IST
Zodiac Signs: ఐంద్ర, వైధృతి యోగం...ఈ రాశులవారికి కష్టాలు...ప్రేమికులకు అనుకూలం
X

Zodiac Signs: అధిక జ్యేష్టమాసం బహుళ పక్ష షష్టి తిథి శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు, ఐంద్ర, వైధృతి యోగం, శనివారం కారవడంతో పలు రాశులకు కొన్ని రకాలైన ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒత్తిడి, ప్రయాణాల్లో ఇబ్బందులు, వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయా రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఈ ఇంద్ర, వైధృతి యోగం ప్రభావం ద్వాదశ రాశులపై ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం.

మేషరాశి

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబం సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. దూర ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తారు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది.

వృషభరాశి

చేపట్టిన పనుల్లో వేగం తగ్గినా అనుకున్న వాటిని రోజు ముగిసేలోగా పూర్తి చేస్తారు. మానసికంగా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవాలి.

మిథునరాశి

చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఓ శుభవార్త మీ చెవిన పడుతుంది. సన్నిహితుల సహకారంతో కీలక పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగ, వృత్తి పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన అంశాలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటకరాశి

విద్యార్ధులకు ఈరోజు కలిసి వస్తుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దూర ప్రయాణాలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. నూతన అవకాశాలు వస్తాయి. పెద్దల మాటకు విలువ ఇస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

సింహరాశి

నూతన ఒప్పందాలు ప్రగతికి అనుకూలంగా మారతాయి. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఉద్యోగంలో మార్పులు ఉండొచ్చు. వ్యాపారంలో లాభాలుంటాయి. ఆరోగ్యంపై దృష్టిసారించాలి.

కన్యారాశి

చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్న పనులను పూర్తి చేస్తారు. పాత సమస్యలు తీరిపోతాయి. శుభవార్తలు వింటారు. కుటుంబం నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది. ధైర్యంతో అడుగులు వేస్తారు. నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు.

తులారాశి

ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు. ఖర్చులు పెరిగినా దానికి తగిన రాబడి వస్తుంది. అయితే కుటుంబ సభ్యుల నుంచి కొంత ఇబ్బందులు ఎదురుకావొచ్చు. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో ప్రమోషన్లు రావొచ్చు.

వృశ్చికరాశి

స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. సన్నిహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు పరిష్కారమౌతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు.

ధనుస్సురాశి

ఖర్చులు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తారు.

మకరరాశి

వ్యాపారంలో లాభాలుంటాయి. అనుకోకుండా ధనం కలిసి వస్తుంది. నూతన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. సంబంధాలు బలపడతాయి.

కుంభరాశి

మానసికంగా ఉల్లాసంగా కనిపిస్తారు. సన్నిహితులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భవిష్యత్‌ ప్రణాళికలు వేసుకుంటారు. ప్రేమికులకు అనుకూలమైన రోజు. విద్యార్ధులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.

మీనరాశి

మిమ్మల్ని వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. చేపట్టిన పనులు వీలైనంత త్వరగా పూర్తిచేస్తారు. ఆధ్యాత్మికరంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.

గమనికః ఇక్కడ ఇచ్చినవి సామాన్యమైన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక ఫలితాల కోసం నిపుణులైన జ్యోతిష్యులను సంప్రదించండి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story