Tiruvuru: అర్ధరాత్రి దొంగల్లా విగ్రహాన్ని ఎత్తుకెళ్తారా.. వైసిపి నిరసన
Tiruvuru: ఏ.కొండూరు మండలం వల్లంపట్లలో వైఎస్ఆర్ విగ్రహాన్ని అర్థరాత్రి తొలగించడంపై వైసిపి నేత నల్లగట్ల స్వామిదాస్ మండిపడ్డారు.
Tiruvuru: అర్ధరాత్రి దొంగల్లా విగ్రహాన్ని ఎత్తుకెళ్తారా.. వైసిపి నిరసన
Tiruvuru: ఏ.కొండూరు (మం) వల్లంపట్ల గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని అర్థరాత్రి వేళ తొలగించడాన్ని తీవ్రంగా ఆక్షేపించిన నియోజకవర్గ- ఇన్చార్జ్ నల్లగట్ల స్వామిదాస్. ప్రైవేట్ ల్యాండ్‌లో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమైన చర్యన్నారు. అధికారులను తాబేదారులుగా వాడుకుంటున్న కూటమి నాయకులు. భారత రాజ్యాగం అందరికి హక్కులు ఇవ్వలేదా, ప్రైవేట్ ఆస్తుల్ని రక్షించాల్సిన బాధ్యత లేదా అంటూ నిలదీశారు.
మీరే మధ్య రాత్రి దొంగల్లాగా వచ్చే విగ్రహాన్నీ ఎత్తుకు పోయారు. గ్రామంలో విగ్రహం తొలగించిన ప్రదేశాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన వైసిపి నేతలు. వైఎస్ఆర్ మరణానంతరం 16ఏళ్ల క్రితం స్థల యజమాని 1సెంటు స్థలమిచ్చి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వీరి స్థలంలోనే భజన మందిరం నిర్మిస్తుండడంతో గ్రామ పెద్దలందరి సమక్షంలో విగ్రహాన్ని ప్రక్కకు తొలగించారు.
గతంలో పనిచేసిన ఎమ్మార్వో ప్రైవేట్ స్థలమని హద్దులు నిర్ధారించారు. విగ్రహ స్థలంలో ఇది ప్రైవేటిదా, ప్రభుత్వానిదా తెలియట్లేదని చెప్తూ రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఫ్లెక్సీని పెట్టారు. రెవిన్యూ, పోలీస్ అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో తీవ్ర ఆగ్రహన్నీ వ్యక్తం చేశారు. అధికారులు కళ్ళు నెత్తికెక్కి పనిచేస్తున్నారు.. దీనిపై న్యాయపోరాటం చేస్తాం. వల్లంపట్లలో తొలగించిన వైఎస్ఆర్ విగ్రహాన్ని కొండూరు ఎంపిడిఓ కార్యాలయం వెనుక పెట్టడంపై తీవ్రంగా ఖండించిన స్వామిదాస్.
దీని వెనుక రాజ్యాంగేతర శక్తి ఎవరున్నారో బయటకు రప్పిస్తాం. వైఎస్ఆర్ విగ్రహాన్ని చూస్తేనే కూటమి నాయకులు భయంతో హడలెత్తిపోతున్నారు. వైయస్సార్ సంక్షేమ పథకాలైన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108 ఇలా పథకాన్ని ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. స్థానిక అధికారులు చట్టాన్ని చేతుల్లో తీసుకోవడంపై మండి పడ్డారు. వచ్చేనెల నాటికి వైయస్ఆర్ విగ్రహాన్ని యధాస్థితిలో ఉంచకపోతే తగిన ప్రతిఫలం తప్పదని హెచ్చరించారు.
చట్టాన్ని అతిక్రమిస్తే మీరు రిటైర్డ్ అయిన వదిలిపెట్టే ప్రసక్తే లేదని, దోషులుగా చట్టం ముందు నిలబెడతామన్నారు. ఈ విషయాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ దృష్టికి పార్టీ అధిష్టాన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ప్రశాంతమైన గ్రామంలో ఇలాంటి దుశ్చర్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తాయన్నారు. జరిగిన ఘటనపై ఎ.కొండూరు తహసిల్దార్ ఉదయ్ భాస్కర్ ను కలిసిన ప్రశ్నించిన ఇంచార్జ్- స్వామి దాస్.




