YS Sharmila: పేరుకే MSP.. ఆచరణలో శూన్యం.. మొక్కజొన్న రైతుల పక్షాన వైఎస్ షర్మిల గళం!

YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న రైతుల పరిస్థితి దారుణంగా ఉందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. మద్దతు ధర లేక రైతులు క్వింటాకు రూ.900 నష్టపోతున్నారని, కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.

Arun Chilukuri
Published on: 24 April 2026 12:28 PM IST
YS Sharmila
X

YS Sharmila: పేరుకే MSP.. ఆచరణలో శూన్యం.. మొక్కజొన్న రైతుల పక్షాన వైఎస్ షర్మిల గళం!

YS Sharmila: ఆంధ్రప్రదేశ్‌లో మొక్కజొన్న (మక్క) రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఘాటుగా స్పందించారు. కూటమి ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమం పడకేసిందని, ఆరుగాలం కష్టపడి పండించిన పంట దళారుల పాలవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ధరలకు, మార్కెట్ ధరలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తిచూపుతూ షర్మిల కీలక ప్రశ్నలు వేశారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధర (MSP) క్వింటాకు రూ. 2400 ఉంటే, మార్కెట్‌లో కేవలం రూ. 1500 మాత్రమే లభిస్తోందని ఆమె పేర్కొన్నారు. ప్రతి క్వింటాపై రైతు రూ. 900 వరకు నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. "రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉన్నట్లా? లేనట్లా?" అని ఆమె నిలదీశారు.

ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. మార్కెట్ ధర మద్దతు ధర కంటే తక్కువగా ఉంటే ఆ లోటును భరిస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రత్యేక 'ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్' (PDP) పథకం ఎందుకు అమలు కావడం లేదని నిలదీశారు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు.

రెండేళ్ల కూటమి పాలన రాష్ట్ర రైతాంగానికి పెనుశాపంగా మారిందని షర్మిల విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించి, మక్క రైతులకు బాసటగా నిలవాలని, మద్దతు ధర దక్కేలా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరపున ఆమె డిమాండ్ చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story