Vijayasai Reddy: పాలిటిక్స్‌కు గుడ్ బై.. ఇకపై జర్నలిస్టుగా కొత్త ఇన్నింగ్స్..!
Vijayasai Reddy: రాజకీయాలకు విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పారు. జర్నలిజం ద్వారా ప్రజలకు సేవ చేస్తానన్న ఆయన, త్వరలోనే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్ మరియు శాటిలైట్ ఛానెల్ ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు.
Vijayasai Reddy: పాలిటిక్స్‌కు గుడ్ బై.. ఇకపై జర్నలిస్టుగా కొత్త ఇన్నింగ్స్..!
Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల నుంచి తాను పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన తదుపరి ప్రస్థానం మీడియా రంగంలోనే అని స్పష్టం చేస్తూ, ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించారు.
డిజిటల్ నుంచి శాటిలైట్ వరకు:
రాజకీయాలకు స్వస్తి పలికిన విజయసాయిరెడ్డి, త్వరలో మీడియా సంస్థను స్థాపించబోతున్నట్లు తెలిపారు. తొలుత తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఒక అత్యాధునిక డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నారు. డిజిటల్ వేదిక స్థిరపడిన తర్వాత, అదే విలువలతో తెలుగులో ఒక పూర్తిస్థాయి శాటిలైట్ న్యూస్ ఛానెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు.
తన మీడియా సంస్థ ఏ రాజకీయ పార్టీకి కొమ్ముకాయబోదని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారు. "మా సంస్థ పూర్తిగా స్వతంత్రంగా ఉంటుంది. సామాన్యులు, మహిళలు, యువత, రైతులు, కార్మికులు మరియు అణగారిన వర్గాల గొంతుకగా నిలుస్తుంది. వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందు ఉంచుతాం" అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం తన సమయాన్ని మీడియా రంగంపైనే వెచ్చిస్తున్నానని, సంస్థ పేరు మరియు ఇతర వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తానని ఆయన తెలిపారు. దశాబ్ద కాలం పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు జర్నలిస్టుగా అవతారం ఎత్తడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.




