Shaik Basu: మైనారిటీల హక్కుల పరిరక్షణే లక్ష్యం: షేక్ బాసుకు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి శుభాకాంక్షలు!

Shaik Basu: హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా మాజీ కౌన్సిలర్ షేక్ బాసు నియమితులయ్యారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 May 2026 6:49 PM IST
Shaik Basu
X

Shaik Basu: మైనారిటీల హక్కుల పరిరక్షణే లక్ష్యం: షేక్ బాసుకు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి శుభాకాంక్షలు!

Shaik Basu: హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన మాజీ కౌన్సిలర్ షేక్ బాసుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ.. సామాజిక న్యాయం, మైనారిటీల హక్కుల పరిరక్షణ, ప్రజాసేవ పట్ల షేక్ బాసు కి ఉన్న నిబద్ధత ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, వారికి అండగా నిలబడే నాయకత్వ లక్షణాలు ఆయనలో సమృద్ధిగా ఉన్నాయని కొనియాడారు.

హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఆయన నియామకం మైనారిటీ వర్గాల అభ్యున్నతికి, వారి హక్కుల పరిరక్షణకు మరింత బలాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ, సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతికి షేక్ బాసు మరింత కృషి చేస్తారని ఆకాంక్షించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story