Tumati Madhava Rao: ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు

Tumati Madhava Rao: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Arun Chilukuri
Published on: 19 Aug 2026 1:05 PM IST
Tumati Madhava Rao
X

Tumati Madhava Rao: ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా తూమాటి మాధవరావు 

Tumati Madhava Rao: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్మన్ పదవికి మాధవరావు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు సభలో అధికారికంగా ప్రకటించారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన డిప్యూటీ చైర్మన్‌ను గౌరవపూర్వకంగా అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టేందుకు సభలోని అన్ని రాజకీయ పక్షాల సభ్యులు కలిసి రావాలని చైర్మన్ మోషేన్ రాజు కోరారు. చైర్మన్‌తో పాటు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మాధవరావును తోడ్కొని వెళ్లి అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు.

నూతన డిప్యూటీ చైర్మన్‌ను సీటు వద్దకు తోడ్కొని వెళ్లే క్రమంలో కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు రాకపోవడంపై మండలిలో వివాదం నెలకొంది. చైర్మన్ పిలిచినప్పటికీ కూటమి సభ్యులు రాకపోవడంపై వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. శాసన మండలి సంప్రదాయాలను పక్కనబెట్టి కూటమి సభ్యులు వ్యవహరించిన తీరు సరికాదని వైఎస్‌ఆర్‌సీపీ నేతలు విమర్శించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story