Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్: డిసెంబర్ నెల TTD ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా విడుదల తేదీలు ఇవే

Tirumala: తిరుమల శ్రీవారి డిసెంబర్ నెల ఆర్జిత సేవలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, వసతి గదుల కోటా విడుదల తేదీలను ప్రకటించిన TTD. పూర్తి వివరాలు ఇవే.

Arun Chilukuri
Published on: 12 Sept 2026 3:30 PM IST
Tirumala
X

Tirumala: తిరుమల భక్తులకు అలర్ట్: డిసెంబర్ నెల TTD ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటా విడుదల తేదీలు ఇవే

Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక ప్రకటన చేసింది. డిసెంబర్‌ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, వసతి గదుల కోటా విడుదల తేదీల వివరాలను వెల్లడించింది. భక్తులు TTD అధికారిక వెబ్‌సైట్ (https://ttdevasthanams.ap.gov.in) ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.

ఈ నెల 19న (ఉదయం 10 గంటలకు) సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవల ఆన్‌లైన్ కోటా విడుదల.

ఈ సేవా టికెట్ల డిప్ కోసం ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. డిప్‌లో ఎంపికైన వారు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు డబ్బులు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలి.

ఈ నెల 22న (ఉదయం 10 గంటలకు): కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్ల విడుదల.

ఈ నెల 22న (మధ్యాహ్నం 3 గంటలకు): వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటా విడుదల.

ఈ నెల 23న (ఉదయం 10 గంటలకు): అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటా విడుదల.

ఈ నెల 23న (ఉదయం 11 గంటలకు): శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా విడుదల.

ఈ నెల 23న (మధ్యాహ్నం 3 గంటలకు): వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగుల ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల.

ఈ నెల 24న (ఉదయం 10 గంటలకు): డిసెంబర్‌ నెల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల.

ఈ నెల 24న (మధ్యాహ్నం 3 గంటలకు): తిరుమల, తిరుపతిలలో అద్దె గదుల బుకింగ్ కోటా విడుదల.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.