TTD Board Meeting: నేడు టీటీడీ పాలకమండలి కీలక భేటీ: మాడవీధుల పేర్ల మార్పు.. శ్రీవాణి ట్రస్ట్‌పై కీలక నిర్ణయం!

TTD Board Meeting: టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం జరగనుంది.

Arun Chilukuri
Published on: 6 May 2026 8:13 AM IST
TTD Board Meeting
X

TTD Board Meeting: నేడు టీటీడీ పాలకమండలి కీలక భేటీ: మాడవీధుల పేర్ల మార్పు.. శ్రీవాణి ట్రస్ట్‌పై కీలక నిర్ణయం!

TTD Board Meeting: టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన తిరుమలలోని అన్నమయ్య భవనంలో కాసేపట్లో పాలకమండలి సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో భక్తుల సౌకర్యాలు, పాలనాపరమైన అంశాలతో పాటు ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు పోటెత్తే సామాన్య భక్తులకు కల్పించాల్సిన వసతి, క్యూలైన్ల నిర్వహణపై బోర్డు ప్రధానంగా చర్చించనుంది. అలాగే, దేశవ్యాప్తంగా రూ. 5 వేల ఆలయాల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలకు ఈ సమావేశంలో ఆమోదం తెలపనున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల వినియోగంపై కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని టీటీడీ భావిస్తోంది.

తిరుమలలోని ప్రధాన రహదారులు, మాడవీధులు మరియు ముఖ్య ప్రాంతాల పేర్ల మార్పుపై బోర్డు చర్చించనుంది. దీనితో పాటు రూ. 86 కోట్ల వ్యయంతో తిరుమలలో నూతన పరిపాలన భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.

టీటీడీ ఉద్యోగుల చిరకాల కోరికైన ఇళ్ల స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిధుల విడుదలపై చర్చించనున్నారు. అలాగే, ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచే ప్రతిపాదనపై బోర్డు సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story