Alluri District: ఈతకు వెళ్లి మృత్యుఒడికి.. పన్నెడా గ్రామంలో రోదనలు
Alluri District: అల్లూరి జిల్లా పెదబయలు మండలం మత్స్యగెడ్డలో విషాదం చోటుచేసుకుంది. ఈతకు వెళ్లిన ఐదుగురు చిన్నారుల్లో ముగ్గురు నీటిలో మునిగి మృతి చెందారు.
Alluri District: ఈతకు వెళ్లి మృత్యుఒడికి.. పన్నెడా గ్రామంలో రోదనలు
Alluri District: అల్లూరి జిల్లా పెదబయలు మండలం పన్నెడా గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఈత కొట్టడానికి వెళ్లి చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. ఈ ఘటన సీతగుంట పంచాయతీ పరిధిలోని లక్కీపుట్టు గ్రామ సమీపంలోని మత్స్యగెడ్డలో జరిగింది.
చిన్నారులు నీటిలో దిగిన కొద్ది సేపటికే ప్రమాదం చోటుచేసుకోగా, ఒక చిన్నారి బయటకు వచ్చి సహాయం కోసం అరవడంతో సమీపంలో చేపల వేటకు వెళ్లిన వారు వెంటనే స్పందించి ఒక చిన్నారిని ప్రాణాలతో కాపాడగలిగారు.
అయితే మిగిలిన ముగ్గురు చిన్నారులు మృత్యువుడికి చేరుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన వారిని గొల్లూరి హర్షిత్ (12), ప్రదీప్ (11), పాంగి బబులు (10)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




