Nellore: పొగాకు రైతు ఆశలపై నీళ్లు.. తక్కువ ధరకే కొనుగోళ్లు!

Nellore: నెల్లూరు జిల్లా డీసీపల్లి పొగాకు వేలం కేంద్రంలో రైతులకు నిరాశ ఎదురైంది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 April 2026 7:51 PM IST
Nellore
X

Nellore: పొగాకు రైతు ఆశలపై నీళ్లు.. తక్కువ ధరకే కొనుగోళ్లు!

Nellore: ఎండనక,వాననక ఆరుగాలం అష్ట కష్టాలు పడి పండించిన పొగాకుకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతులు ఆశలపై నీళ్లు పడ్డట్లు అయింది నెల్లూరు జిల్లా డిసిపల్లి వేలం కేంద్రం పరిధిలోని రైతుల పరిస్థితి. నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం డీసీపల్లిలో గురువారం అట్టహాసంగా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. అయితే గత మూడు సంవత్సరాలుగా రైతులకు అరకొర లాభాలు వస్తున్నాయన్న ఆనందంలో ఉన్న ఈ తరుణంలో కేజీ పొగాకు ధర 250 రూపాయలు మాత్రమే పలికింది.

దీంతో రైతులు నిరాశ చెందక తప్పలేదు. ప్రస్తుతం ఈ ఏడాది సాగు చేసేందుకు రెట్టింపు పెట్టు బదులు పెట్టి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక పోవడంతో వారి ఆశలు అడియాశలు అయ్యాయి. తొలి రోజున కొనుగోళ్లు ప్రారంభించే ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వ్యాపారస్తులు వేలంలో పాల్గొని పొగాకును కొనుగోలు చేశారు. ఈవేలం కేంద్రానికి 18 పొగాకు బేళ్లను రైతులు తీసుకురాగా ఆ 18 దీళ్లను వ్యాపారస్తులు కొనుగోలు చేయడం జరిగింది.

ఈ వేళలో 8 కంపెనీల వ్యాపారస్తులు పాల్గొని పొగాకును కొనుగోలు చేశారు. మొదటిగా వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ వేలంలో వ్యాపారస్తుల ముందు అధిక ధరను ఉంచగా అదే ధరకు అన్ని పొగాకు బీళ్ళు అమ్ముడు పోయాయి. అయితే రైతుల మాత్రం ఈ ధర గిట్టుబాటు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత ఈ ఏడాది పెట్టిన పెట్టుబడులకు కిలో గరిష్ట పొగాకు ధర 350 రూపాయల పలికితేనే రైతులు గట్టికుతారని వ్యాపారస్తుల ముందు రైతులు వాపోయారు.

అలా లేని పక్షంలో అదే ధర పలికితే నష్టపోక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేశారు.గరిష్ట కనిష్ట ధరలు హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ సరాసరి ధర మాత్రం 3 వందల రూపాయలు నిలకడగా ఉంటేనే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు వ్యాపారస్తులు ముందు వాపోయారు. అందుకు సంబంధించి బోర్డు అధికారులు వ్యాపారస్తులతో చర్చలు జరిపి తగు న్యాయం చేయవలసిందిగా రైతులు కోరుతున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story