TDP Mahanadu 2026: రేపటి నుంచే ‘టీడీపీ మహానాడు’.. చరిత్రలో తొలిసారి హైబ్రిడ్ విధానం, గిన్నిస్ రికార్డుపై పల్లా ధీమా!
TDP Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక పండుగ 'మహానాడు'కు సర్వం సిద్ధమైంది.
TDP Mahanadu 2026: రేపటి నుంచే ‘టీడీపీ మహానాడు’.. చరిత్రలో తొలిసారి హైబ్రిడ్ విధానం, గిన్నిస్ రికార్డుపై పల్లా ధీమా!
TDP Mahanadu 2026: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా.. ప్రతి ఏడాది నిర్వహించే మహానాడు పండుగకు తెలుగు తమ్ముళ్లు సిద్ధమయ్యారు. రేపు, ఎల్లుండి రెండ్రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. అయితే.. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా ఈసారి మహానాడు కార్యక్రమాన్ని పార్టీ చరిత్రలో తొలిసారిగా హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్నారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తొలిరోజు కార్యక్రమాలు జరగనున్నాయి.
ముందుగా.. ఎన్టీఆర్కు నివాళి, తెలుగుతల్లి పాటతో మహానాడు ప్రారంభమవుతుంది. గంటన్నర పాటు తొలి సెషన్ జరగనుంది. ఆ తర్వాత 15 నిమిషాలు స్వల్ప విరామం ఉంటుంది. మరో గంటన్నర రెండో సెషన్ తర్వాత భోజన విరామం ఉంటుంది. మొత్తం 20 తీర్మానాలకు సంబంధించి.. 65 మంది వక్తలు మాట్లాడనున్నారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించే టీడీపీ మహానాడు గిన్నిస్ రికార్డ్ సృష్టిస్తుందని.. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. మహిళామణులకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం కల్పించటమే లక్ష్యంగా ఈసారి మహానాడు నిర్వహిస్తున్నామని చెప్పారు.




