Markapuram: మానవత్వం చాటుకున్న తెదేపా నాయకులు.. బాటసారుల కోసం తాగునీరు

Markapuram: బెస్తవారిపేట పంచాయతీ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు చలివేంద్రాన్ని ప్రారంభించారు.

MADARVALI, MARKAPURAM
Published on: 11 April 2026 5:59 PM IST
Markapuram
X

Markapuram: మానవత్వం చాటుకున్న తెదేపా నాయకులు.. బాటసారుల కోసం తాగునీరు

Markapuram: మార్కాపురం జిల్లా బేస్తవారిపేట కేంద్రంలోని పంచాయతీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం నాడు బెస్తవారిపేట టిడిపి నాయకులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బేస్తవారిపేట టిడిపి నాయకులు మాట్లాడుతూ..

వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా ఉండేందుకు చలివేంద్రాల ఏర్పాటు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా మార్కెట్ ప్రాంతాలకు రోజూ భారీ సంఖ్యలో వచ్చే వ్యాపారులు, కూలీలు, వినియోగదారులు తీవ్రమైన ఎండల కారణంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగినది.

ఈ కార్యక్రమంలో బేస్తవారిపేట ఎమ్మార్వో జితేంద్ర గారు, బెస్తవారిపేట ఎంపీడీవో రంగనాయకులు గారు, బెస్తవారిపేట పంచాయతీ సెక్రెటరీ రామిరెడ్డి గారు, కంభం మార్కెట్ చైర్మన్ భూపాల్ రెడ్డి గారు, బెస్తవారిపేట మండల ప్రధాన కార్యదర్శి గుంతక నరసింహ యాదవ్ గారు, బేస్తవారిపేట టౌన్ అధ్యక్షుడు దూదేకుల కాసిం పీరా (సైదులు), మాజీ ఉప సర్పంచ్ మట్టా రమేష్ గారు, తీగి రెడ్డి భూపాల్ రెడ్డి గారు, దూదేకుల ఆదం గారు, ఆకుల శీను గారు, మార్కెట్ వ్యాపారులు, కార్యకర్తలు మరియు ప్రజలు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM

Next Story