Simhachalam: చందనోత్సవంలో ప్లాస్టిక్ నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు!

Simhachalam: సింహాచలం చందనోత్సవం సందర్భంగా భక్తులకు అందించే ప్రసాదాలు, పారిశుధ్యం మరియు భద్రతపై ఈఓ జల్లేపల్లి వెంకట్రావు సమీక్ష నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 9 April 2026 12:49 PM IST
Simhachalam
X

Simhachalam: చందనోత్సవంలో ప్లాస్టిక్ నిషేధం.. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు!

Simhachalam: శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం.

​సింహాచలం చందనోత్సవం – భక్తులకు పంపిణీ చేసే ప్రసాదాలు, పారిశుధ్యం మరియు భద్రతపై కీలక ఆదేశాలు.

శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి చందనోత్సవ వేడుకలను పురస్కరించుకుని, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు మరియు స్వచ్ఛంద సంస్థల సేవలపై నేడు ఆలయ పరిపాలనా భవనంలో కార్యనిర్వహణ అధికారి జల్లేపల్లి వెంకట్రావు అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జీవీఎంసీ హెల్త్ డిపార్ట్‌మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్ ఫుడ్ సేఫ్టీ అధికారులు మరియు వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

​స్వచ్ఛంద సంస్థలు భక్తులకు పంపిణీ చేసే ఆహార పదార్థాల వల్ల క్యూ లైన్లకు ఎటువంటి ఆటంకం కలగకూడదు.

​భక్తులు కదులుతున్న సమయంలోనే పదార్థాలను పంపిణీ చేయాలి. పంపిణీ కోసం భక్తులను ఆపడం వల్ల లైన్లు జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

​ఆహార పదార్థాలు పంపిణీ చేసే ప్రాంతంలో పారిశుధ్య బాధ్యత సంబంధిత స్వచ్ఛంద సంస్థలదే.

​పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే, సదరు సంస్థలను తక్షణమే అక్కడ నుండి పంపించివేయడం జరుగుతుందని ఈఓ తెలిపారు.

​ఫుడ్ సేఫ్టీ అధికారి చక్రవర్తి మాట్లాడుతూ, భక్తులకు అందించే ఆహారం వేడిగా ఉండాలని, ఫుడ్ పాయిజన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

​సేవలో పాల్గొనే వాలంటీర్లు తప్పనిసరిగా గ్లౌజులు (Gloves) మరియు హెడ్ క్యాప్‌లు (Head Caps) ధరించాలి.

​జీవీఎంసీ అధికారి రాజారావు కుమార్ మాట్లాడుతూ, ప్రసాదాల పంపిణీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వస్తువులను వాడరాదని స్పష్టం చేశారు.

​కేవలం పర్యావరణహితమైన (Eco-friendly) వస్తువులను మాత్రమే వినియోగించాలని ఆదేశించారు.

​గోపాలపట్నం సిఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ, పోలీసు శాఖ వద్ద ఉన్న జాబితా ప్రకారం అనుమతి పొందిన సంస్థల ప్రతినిధులను మాత్రమే స్టాల్స్ వద్దకు అనుమతిస్తామని తెలిపారు.

​వాహన పాసులు కూడా పోలీసుల వద్ద ఉన్న రికార్డుల ప్రకారం సరిచూసిన తర్వాతే అనుమతించబడతాయి.

​చందనోత్సవ ప్రసాదాల పేరుతో కొన్ని సంస్థలు బయట చందాలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని ఈఓ తెలిపారు.

​భక్తుల నుండి చందాలు అడిగే సంస్థలపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

​ఈ సమావేశమునకు మెడికల్ డిపార్ట్మెంట్ డా:రామిరెడ్డి

దేవస్థానం ఎస్ డి సి మధులత పర్యవేక్షణ అధికారి పాలూరి నర్సింగరావు స్వచ్ఛంద సంస్థల ఆర్గనైజర్లు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story