Puttaparthi: పాత నేరస్తులపై పోలీసుల కన్ను.. పుట్టపర్తిలో కౌన్సిలింగ్
Puttaparthi: శ్రీ సత్యసాయి జిల్లాలో చోరీల నియంత్రణకు ఎస్పీ సతీష్ కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Puttaparthi: పాత నేరస్తులపై పోలీసుల కన్ను.. పుట్టపర్తిలో కౌన్సిలింగ్
Puttaparthi: జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ.. చోరీల నియంత్రణకు శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ వినూత్న శ్రీకారం చుట్టారు. జిల్లా వ్యాప్తంగా చోరీలను అరికట్టే విధంగా పోలీసులకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. గతంలో చోరీలకు పాల్పడిన పాత నేరస్తుల యొక్క ప్రవర్తన వారు ప్రస్తుత ఎటువంటి జీవనం సాగిస్తున్నారు. అన్న కోణంలో నిత్యం వారిపై నిఘా పెట్టే విధంగా పోలీసులు అధికారులకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అందులో భాగంగా ప్రతి వారంలో ఒక్కరోజు పోలీస్ స్టేషన్ కి పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని ఎస్పీ, పోలీసు అధికారులకు సూచించారు. అందులో భాగంగా ఆదివారం జిల్లా వ్యాప్తంగా పాత నేరస్తులతో పాటు ,రౌడీ షీటర్లు సైతం పోలీస్ స్టేషన్లో పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నారు. నేర ప్రవృత్తితో పాటు, చోరీలకు, పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసు అధికారులు హెచ్చరించారు.




