Sapta Sindhu: వేల ఏళ్ల నాటి ఆలయాల వెనుక ఉన్న సీక్రెట్ ఇదే: విజయవాడలో 'సప్తసింధు' సదస్సు!
Sapta Sindhu: వేల సంవత్సరాల తర్వాత కూడా ఆలయాలు ఎలా చెక్కుచెదరకుండా ఉన్నాయి? విజయవాడలో హెచ్‌ఎంటీవీ ఆధ్వర్యంలో 'సప్తసింధు' రెండు రోజుల సదస్సు.. ఐదు రాష్ట్రాల విద్యార్థుల భాగస్వామ్యం!
Sapta Sindhu: వేల ఏళ్ల నాటి ఆలయాల వెనుక ఉన్న సీక్రెట్ ఇదే: విజయవాడలో 'సప్తసింధు' సదస్సు!
Sapta Sindhu: భారతీయ చారిత్రక దేవాలయాల వెనుక దాగి ఉన్న అద్భుతమైన శాస్త్రీయ, ఇంజనీరింగ్ మరియు సుస్థిర సూత్రాలను ప్రపంచానికి చాటిచెప్పాల్సిన బాధ్యత నేటి తరం ఆర్కిటెక్ట్‌లపై ఉందని బీజేపీ నాయకురాలు సాధినేని యామిని స్పష్టం చేశారు. విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (SPA) వేదికగా హెచ్‌ఎంటీవీ మరియు ది హన్స్ ఇండియా సంయుక్త భాగస్వామ్యంతో నిర్వహించిన 'సప్త సింధు 2026' సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఒక సమాజం తన రాబోయే తరాలకు అందించే సంస్కృతి మరియు జ్ఞానంలో వాస్తుశిల్పం పాత్ర ఎంతటి ప్రాముఖ్యమైనదో వివరించిన సాధినేని యామిని... "ప్రతి నాగరికత తన ఆత్మకథను మూడు రూపాల్లో రాసుకుంటుంది — ఒకటి సాహిత్యం, రెండు పాలనా సంస్థలు, మూడోది వాస్తుశిల్పం (Architecture). సాహిత్యం ప్రజల నమ్మకాలను, సంస్థలు పాలనా విధానాన్ని తెలియజేస్తే.. వాస్తుశిల్పం ఆ నాగరికత దేనికి విలువ ఇచ్చిందో, భవిష్యత్తు తరాలు దేనిని గుర్తుంచుకోవాలని అనుకుందో చాటిచెబుతుంది. ఆ భాష ద్వారానే నాగరికత తరతరాలతో మాట్లాడుతుంది." అని సాధినేని యామిని అన్నారు.
మన పూర్వీకుల నుంచి వచ్చిన ప్రాచీన భారతీయతను, కాలాతీత విజ్ఞానాన్ని తిరిగి ఆవిష్కరించేందుకు 'సప్త సింధు' లాంటి జాతీయ వేదికలు యువ ఆర్కిటెక్ట్‌లకు ఎంతో ప్రేరణనిస్తాయని చెప్పారు. ఈ జాతీయ స్థాయి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ భాగస్వామ్యం కావడం గర్వకారణమని, ఇటువంటి సదస్సులు యువత ఆలోచనా ధోరణిని మారుస్తాయని తెలిపారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి తదితర ప్రముఖులు పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో ఈ సదస్సును ప్రారంభించారు.భారతీయ సాంప్రదాయ ఆలయ నిర్మాణాలు కేవలం పూజా స్థలాలు మాత్రమే కావు అని, అవి ఇంజనీరింగ్ అద్భుతాలని సాధినేని యామిని కొనియాడారు.




