Dharmavaram: ఏప్రిల్ 16న మహిళా రిజర్వేషన్ బిల్లు.. బీసీల డిమాండ్

Dharmavaram: మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళలకు 33 శాతం కోటాలో కల్పించాలని ధర్మవరం బీసీ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM
Published on: 12 April 2026 4:49 PM IST
Dharmavaram
X

Dharmavaram: ఏప్రిల్ 16న మహిళా రిజర్వేషన్ బిల్లు.. బీసీల డిమాండ్

Dharmavaram: ఢిల్లీలోని పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఏప్రిల్ 16న జరగనున్న మహిళ రిజర్వేషన్ సవరణ బిల్లుకు అత్యంత కీలకము కానున్నది. చారిత్రాత్మకమైన ఈ బిల్లును ఆమోదింప చేయడమే లక్ష్యంగా నేడు బీజేపీ అధిష్టానం సంసిద్ధంగా ఉంది. మహిళా సాధికారత దిశగా మోడీ ప్రభుత్వం చేస్తున్న ఈ అడుగులపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటువంటి సమయంలో శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షురాలు సంకారపు జయశ్రీ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలవడం జరిగింది.

ఈ సందర్భంగా బీసీల యొక్క డిమాండ్లు సమస్యలను ఒక వినతి పత్రం ద్వారా వారు అందజేశారు. అనంతరం సంకారపు జయశ్రీ మాట్లాడుతూ 33 శాతం మహిళలకు అవకాశం ఉన్నందున, ఇందులో బీసీల వాటా ఎంత అని అడగడం జరిగిందని, ఈ విషయంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అడగాలని విన్నవించడం జరిగిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల జనాభా 50 శాతం కు పైగా ఉన్నామని, రాబోయే రోజుల్లో చట్టసభల్లో చక్కటి అవకాశం వస్తుందని తెలిపారు.

ముఖ్యంగా మహిళలకు 33 శాతము రిజర్వేషన్ ప్రకటించడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలపడం జరిగిందని తెలిపారు. కానీ ఈ రిజర్వేషన్ బిల్లులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించాల్సిన అవసరం అనగా బీసీల వాటాలో ఒక ప్రకటన ఇవ్వాలని తాము అడగడం జరిగిందని తెలిపారు. ఈ విషయంలోనే గత సంవత్సరం జిల్లాల వారీగా ధర్నాలు, ఒకరోజు నిరాహార దీక్షలు చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు. లోక్సభలో ఏప్రిల్ 16వ తేదీన ప్రవేశపెట్టే ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు శాశ్వత ప్రాతిపతకాన ఉండే విధంగా న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు.

ప్రస్తుతం దేశంలోని ఎంపీలు అందరూ కూడా మహిళ బిల్లు 33 శాతం రిజర్వేషన్ విషయంలో సుముఖత చూపుతున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలు 70 శాతం ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ద్వారా 33 శాతం కోటాలో బీసీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరడం జరిగిందన్నారు. ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తప్పక న్యాయం చేస్తామని వారు హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.

PAMALA NAGENDRA, DHARMAVARAM

PAMALA NAGENDRA, DHARMAVARAM

Next Story