Sajjala Bhargava Reddy: పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సజ్జల భార్గవ్‌రెడ్డి.. అసభ్యకర పోస్టులపై విచారణ!

Sajjala Bhargava Reddy: వైసీపీ సోషల్‌ మీడియా రాష్ట్ర కన్వీనర్‌ సజ్జల భార్గవ్‌రెడ్డి పులివెందుల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ కుటుంబ సభ్యులతో పాటు షర్మిల, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టించిన కేసులో విచారణ కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 25 April 2026 12:44 PM IST
Sajjala Bhargava Reddy
X

Sajjala Bhargava Reddy: పులివెందుల పోలీస్ స్టేషన్‌లో సజ్జల భార్గవ్‌రెడ్డి.. అసభ్యకర పోస్టులపై విచారణ!

Sajjala Bhargava Reddy: వైసీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ్‌రెడ్డి శనివారం పులివెందుల పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులు, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టించారనే ఆరోపణలపై నమోదైన కేసులో భాగంగా ఆయన డీఎస్పీ మురళీ నాయక్ ఎదుట హాజరయ్యారు.

2024 నవంబర్ 8న భార్గవ్‌రెడ్డితో పాటు వర్రా రవీందర్‌రెడ్డి, అర్జున్‌రెడ్డిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లను లక్ష్యంగా చేసుకుని, వారి కుటుంబ సభ్యుల పట్ల అత్యంత హేయమైన రీతిలో పోస్టులు పెట్టించినట్లు అభియోగాలు ఉన్నాయి. 2022 నుంచి తాడేపల్లిలోని ఐకాన్ బిల్డింగ్ కేంద్రంగా 130 మంది కన్వీనర్లతో భార్గవ్‌రెడ్డి ఒక నెట్‌వర్క్‌ను నడిపిస్తూ ఈ పోస్టులను వైరల్ చేయించినట్లు పోలీసులు గుర్తించారు.

కేవలం రాజకీయ ప్రత్యర్థులే కాకుండా, వైఎస్ కుటుంబ సభ్యులైన షర్మిల, సునీత, విజయమ్మలను సైతం వదలకుండా వర్రా రవీందర్‌రెడ్డి ద్వారా భార్గవ్‌రెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ వ్యవహారంలో ఐటీ చట్టంతో పాటు పలు క్రిమినల్ సెక్షన్ల కింద నమోదు చేసిన కేసుపై సైబర్ క్రైమ్ అధికారులు, పోలీస్ బృందం లోతుగా ఆరా తీస్తోంది.

ప్రస్తుతం డీఎస్పీ ఆధ్వర్యంలోని బృందం భార్గవ్‌రెడ్డిని పలు కోణాల్లో ప్రశ్నిస్తోంది. విచారణ అనంతరం తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయన్నది ఉత్కంఠగా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story