Sai Krishna Missing Case: సీఐ నాగరాజు అరెస్ట్.. సాయికృష్ణ కేసులో హైకోర్టు కీలక విచారణ!
Sai Krishna Missing Case: సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తుపై హైకోర్టులో కీలక విచారణ జరిగింది. కేసు విచారణకు సిట్ (SIT) ఏర్పాటు చేసినట్లు ఏజీ కోర్టుకు తెలిపారు.
Sai Krishna Missing Case: సీఐ నాగరాజు అరెస్ట్.. సాయికృష్ణ కేసులో హైకోర్టు కీలక విచారణ!
Sai Krishna Missing Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ అదృశ్యం కేసు విచారణ బుధవారం హైకోర్టులో జరిగింది. ఈ కేసు దర్యాప్తును సీబీఐ (CBI) కి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిల్ (PIL) పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (AG) కోర్టుకు హాజరై కీలక వివరాలను వెల్లడించారు.
సాయికృష్ణ అదృశ్యం కేసును అత్యంత పారదర్శకంగా, వేగంగా దర్యాప్తు చేసేందుకు పోలీసు ఉన్నతాధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసినట్లు ఏజీ ధర్మాసనానికి వివరించారు. దర్యాప్తు సక్రమంగా సాగేందుకు వీలుగా అన్ని రకాల ముందస్తు చర్యలు తీసుకున్నామని కోర్టుకు తెలిపారు.
అదేవిధంగా, ఈ కేసులో నిందితుడిగా ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (CI) నాగరాజును ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారని, బుధవారమే అతడిని న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు ఏజీ స్పష్టం చేశారు. ప్రభుత్వ వాదనలు విన్న అనంతరం హైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. "ఏం చేస్తారో వేచి చూద్దాం" అని వ్యాఖ్యానించింది. అనంతరం కేసు తదుపరి విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది.




