Kurnool: దేశభక్తి గీతాలాపనలో భాగస్వాములు కండి.. ఆర్‌ఎస్‌ఎస్ పిలుపు
Kurnool: ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల ఉత్సవాల సందర్భంగా కర్నూలులో "స్వరనీరాజనం" సంగీత విభావరిని నిర్వహిస్తున్నారు.
Kurnool: దేశభక్తి గీతాలాపనలో భాగస్వాములు కండి.. ఆర్‌ఎస్‌ఎస్ పిలుపు
Kurnool: నూరు సం. సంఘ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు సంభవించినప్పుడు, తిరిగి మళ్ళీ పునరుజ్జీవనం పొందడనికీ, మళ్ళీ ఉత్సాహాన్ని, దేశభక్తి భావనను నింపడానికి ఎందరో మహానుభావులు రచించి, పాడిన అద్భుతమైన పాటలు జిల్లా లోనే మోట్టమొదటి సారిగా
శతాబ్ది సమయాన సంఘ గీతాలాపన "స్వరనీరాజనం" పేరుతో నిర్వహించబోయే ఈ సంగీత విభావరి లో ఆవిష్కరించబోతున్నామనీ, ఈ కార్యక్రమం వల్ల నేటి యువత మరియు పిల్లలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క "ఆత్మ" ను పరిచయం చేయబోతున్నామనీ, కావున మీడియా మిత్రుల ద్వారా కర్నూలు జిల్లాలోని అశేష హిందూ సమాజానికి పై కార్యక్రమం విషయాలు, వివరాలు తెలియజేసి ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమానికి తరలి రావాలని స్వాగతం పలుకుతున్నామని తెలియజేశారు ప్రముఖ న్యాయవాది ముద్దనూరు శ్రీధర్ తెలియజేశారు.
సంస్థ ఉపాధ్యక్షులు మాకం నాగరాజు మాట్లాడుతూ..
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంవత్సరాల (100 సం.)శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంలో. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, సాంస్కృతిక విభాగమైన "సంస్కృత భారతి, కర్నూలు" విభాగం వారి ఆధ్వర్యంలో ఈనెల అనగా ఏప్రిల్ 14 (రాజ్యాంగ నిర్మాత దాదాసాహెబ్ అంబేద్కర్ జయంతి) రోజున మంగళవారం, సా. 5:30 గం.లకు బి. క్యాంపు లో గల శ్రీ టీ.జీ. లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణం మంటపం, ఆఫీసర్స్ క్లబ్, కర్నూలు లో ఏర్పాటు చేశామని మరియు పై కార్యక్రమ వివరాలు తెలియజేస్తూ.
ఈ కార్యక్రమానికి. ముఖ్య అతిథిగా కర్నూలు నగర పాలక సంస్థ కమీషనర్ పీ.విశ్వనాథ్ గారు, విశిష్ట అతిథి గా ప్రముఖ న్యూరో ఫిజీషియన్ డా. నరసరాం ప్రధాన వక్త గా ఏలే శ్యాం కుమార్ (అఖిల భారత ధర్మ జాగరణ సహ ప్రముఖ్, హైదరాబాద్) గార్లు పాల్గొంటారు.




