Kalyandurg: ఖచ్చితమైన సమాచార సేకరణే లక్ష్యం.. ఆర్‌డీవో వసంత బాబు

Kalyandurg: కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో జనగణన-2027 శిక్షణ తరగతులను ఆర్‌డీవో వసంత బాబు పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 10 April 2026 12:28 PM IST
Kalyandurg
X

Kalyandurg: ఖచ్చితమైన సమాచార సేకరణే లక్ష్యం.. ఆర్‌డీవో వసంత బాబు

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో నిర్వహిస్తున్న జనగణన–2027 (దశ–I) శిక్షణ కార్యక్రమాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ వసంత బాబు సందర్శించారు. శిక్షణ రెండవ రోజు జరుగుతున్న తరగతులను పరిశీలించి అధికారులకు మార్గనిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొంటున్న అధికారులకు మరియు సిబ్బందికి జనగణన ప్రాముఖ్యతపై ఆయన సమగ్రంగా వివరించారు. దేశ అభివృద్ధి ప్రణాళికలకు జనగణన ఎంత ముఖ్యమో వివరిస్తూ, ఖచ్చితమైన సమాచార సేకరణ అత్యంత అవసరమని తెలిపారు. ప్రతి గృహానికి వెళ్లి సరైన వివరాలు నమోదు చేయాలని సూచించారు.

అదేవిధంగా జనగణన ప్రక్రియలో పాటించాల్సిన నియమాలు, గృహ గణన విధానం, డేటా సేకరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన మార్గదర్శకాలు అందించారు. ఫీల్డ్‌లో పని చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

ఈ సందర్భంగా శిక్షణలో పాల్గొంటున్న సిబ్బందికి సెన్సస్ కార్యకలాపాల నియామక పత్రాలను కూడా అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్,ట్రైనర్లు,అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. జనగణన ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి అందరూ సమన్వయంతో పని చేయాలని ఆర్‌డీవో సూచించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story