Razole: ఇళ్ల నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు క్షేమం.. పోలీసుల చాకచక్యం!

Razole: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఇళ్ల నుంచి వెళ్లిపోయిన ముగ్గురు మైనర్ బాలికలను రాజోలు పోలీసులు కేవలం గంట వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించారు.

PRABHU, RAZOLE
Published on: 27 Jun 2026 9:45 AM IST
Razole
X

Razole: ఇళ్ల నుంచి వెళ్లిన ముగ్గురు బాలికలు క్షేమం.. పోలీసుల చాకచక్యం!

రాజోలు (డాక్టర్.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా): డాక్టర్.బిఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు లో ఇంటి నుంచి వెళ్లిపోయిన ముగ్గురు మైనర్ బాలికలను కేవలం గంట వ్యవధిలోనే సురక్షితంగా గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించిన రాజోలు పోలీసులు మరోసారి తమ సమర్థతను నిరూపించారు. కుటుంబ సభ్యులు ఆందోళనతో కన్నీళ్లు పెట్టుకుంటున్న వేళ.. పోలీసులు చూపిన చాకచక్యం, వేగం మూడు కుటుంబాల్లో ఆనందాన్ని నింపింది.

రాజోలు గ్రామం లోని నున్నవారి బాడవ, అడవివారిపాలెం ప్రాంతాలకు చెందిన 14, 15, 16 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు మైనర్ బాలికలు స్నేహితులు. కుటుంబ సభ్యుల మందలింపుతో మనస్తాపానికి గురైన వారు సాయంత్రం ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. రాత్రి 7 గం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురై రాజోలు పోలీసులను ఆశ్రయించారు.

ఫిర్యాదు అందుకున్న వెంటనే రాజోలు ఎస్ఐ పి. మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలోని పోలీసు బృందం అప్రమత్తమైంది. సీసీటీవీ ఫుటేజీలను నిమిషాల్లో పరిశీలించి, బాలికల కదలికలను గుర్తించింది. ఆ తర్వాత స్థానికుల సహకారంతో ప్రత్యేక గాలింపు చేపట్టి, గంట తిరగకముందే ముగ్గురు బాలికలను సమీప ప్రాంతం లోనే సురక్షితంగా గుర్తించింది.

పోలీసుల వేగవంతమైన చర్యలతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నివారించగలిగారు. బాలికలకు కౌన్సెలింగ్ నిర్వహించి, అనంతరం వారి తల్లిదండ్రులకు అప్పగించారు. పిల్లలు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఆనందభాష్పాలు కారుస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఘటనలో అద్భుతంగా స్పందించిన రాజోలు పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ప్రత్యేకంగా అభినందించారు. "ఫిర్యాదు అందితే చాలు.. క్షణాల్లో స్పందన, గంటలో ఫలితం" అనేలా రాజోలు పోలీసులు పనిచేసిన తీరు స్థానికుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ ఎంత అప్రమత్తంగా పనిచేస్తుందో ఈ ఘటన మరోసారి స్పష్టం చేసింది.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story