Antarvedi: అంతర్వేది మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన రంగురంగుల చేప!
Antarvedi: బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల వలకు అరుదైన రంగురంగుల 'గ్రూపర్' (మురుమీన్) చేపలు చిక్కాయి.
Antarvedi: అంతర్వేది మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన రంగురంగుల చేప!
అంతర్వేది: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలోని మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి సముద్ర వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అరుదైన రంగురంగుల మురుమీన్ చేపలు చిక్కాయి. సాధారణంగా ఈ తరహా చేపలు వలకు చాలా అరుదుగా లభిస్తాయని మత్స్యకారులు తెలిపారు.
విభిన్న రంగులతో ఆకర్షణీయంగా కనిపించే ఈ చేపలను "గ్రూపర్" జాతికి చెందినవిగా గుర్తించారు. వీటి ప్రత్యేక రంగులు, ఆకృతి స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హార్బర్‌కు చేరుకున్న ఈ చేపలను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.
మురుమీన్ చేపల మాంసం ఎంతో రుచికరంగా ఉండటంతో పాటు పోషక విలువలు కూడా అధికంగా ఉంటాయని మత్స్యకారులు తెలిపారు. అరుదుగా లభించే ఈ రంగురంగుల చేపలు హార్బర్ వద్ద సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి.
Next Story




