Nellore: కలెక్టరేట్‌లో ప్రజాసత్తా పార్టీ వినతి.. మహిళా సాధికారతే లక్ష్యం

Nellore: చట్టసభలు మరియు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ప్రజాసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు పులగర శోభన్ బాబు డిమాండ్ చేశారు.

V. Narasimhulu, Nellore
Published on: 10 April 2026 4:38 PM IST
Nellore
X

Nellore: కలెక్టరేట్‌లో ప్రజాసత్తా పార్టీ వినతి.. మహిళా సాధికారతే లక్ష్యం

Nellore: ప్రజాసత్తా మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రజాసత్తా వ్యవస్థాపక, జాతీయ అధ్యక్షులు పులగర శోభన్ బాబు అధ్యక్షతన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ విజయ్ కుమార్ ను శుక్రవారం కలిసి చట్టసభలలో, స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు నామినేటెడ్ పదవులలో మహిళలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ జిల్లా రెవెన్యూ అధికారి ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా పాత్రికేయులతో పులగర శోభనబాబు మాట్లాడుతూ..

నారీ శక్తి వందన్ అధినియం- 106వ రాజ్యాంగ సవరణ చట్టం-మహిళా రిజర్వేషన్ బిల్లు 2023 ఒక చారిత్రాత్మక నిర్ణయం అని కొనియాడారు.. లోక్ సభ,రాష్ట్ర అసెంబ్లీలలో 33% సీట్లు మహిళలకు జన గణన మరియు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాలని, నిర్ణయాధికారంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలని పులగర శోభన్ బాబు కోరారు.

33 శాతం నుండి 50 శాతంకు పెంచాలని తెలిపారు మహిళలకు ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారతలను పెంచాలని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వారికి సముచిత స్థానం కల్పించడంలో భాగంగా, అన్ని రాజకీయ పార్టీలలో నాయకత్వ పదవులలో 50% ఇవ్వాలని, అన్ని పార్టీల అధ్యక్షులకు పులగర శోభన్ బాబు పిలుపునిచ్చారు. తెల్లరేషన్ కార్డు పొందుటకు నాలుగు చక్రాల వాహనాలు, 3 యూనిట్లు కంటే ఎక్కువ కరెంటు, మెట్ట భూమి 5 ఎకరాలు, మాగాణి భూమి మూడు ఎకరాలు నియమ నిబంధనలు ఏ విధంగా పెడుతున్నారో.

రాజకీయాలలో కూడా అదేవిధంగా నిబంధనలను వర్తింపచేసి పేదలకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించేలా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పునాదులు వేయాలని సూచించారు. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు పథకం ఏర్పాటు ద్వారా ఎంతో మంది మహిళలు బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకుంటున్నట్లు, ఈ అవకాశాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పులగర శోభన బాబు ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు.

ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సు,అర్హత కలిగిన మహిళలకు రూ. 1500, మరియు నిరుద్యోగ భృతి రూ. 3000 విడుదల చేయాలని ప్రభుత్వానికి శోభన్ బాబు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాసత్తా నాయకులు మెడబల్లి గోపి,గుంటగాని రామయ్య, ప్రజాసత్తా మహిళ అధ్యక్షురాలు ఒంగోలు హెఫ్సిబా, ఉపాధ్యక్షురాలు కట్ల కాంతమ్మ, కార్యదర్శి తాతపూడి పద్మ, సహాయ కార్యదర్శి కుడుముల శారమ్మ, కోశాధికారి కుడుముల స్రవంతి, సభ్యులు దువ్వూరి సువార్తమ్మ, కట్ల వజ్రమ్మ, కుడుమల సలోమి, తుపాకుల చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story