Palakonda: విధుల బహిష్కరణ.. కోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన
Palakonda: పీలేరు న్యాయవాది ఎల్లప్ప హత్యకు నిరసనగా పాలకొండలో న్యాయవాదుల ధర్నా.
Palakonda: విధుల బహిష్కరణ.. కోర్టు వద్ద న్యాయవాదుల ఆందోళన
Palakonda: పీలేరుకు చెందిన న్యాయవాది పూజారి ఎల్లప్పను దుండగులు అతి దారుణంగా హత్య చేయడాన్ని ఖండిస్తూ పాలకొండ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు విధులు బహిష్కరించి కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మునిస్వామీ, ఉపాధ్యక్షులు ఎం. వెంకటేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి అల్లన శివాదాస్, ఎన్ని ప్రకాష్,మరిచర్ల జగన్మోహన రావు,
మాట్లాడుతూ దేశంలో రోజురోజుకూ న్యాయవాదులపై భౌతిక దాడులు పెరగడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన న్యాయం కోసం పోరాడే న్యాయవాదులపై కక్షలు పెంచుకుని హత్యలకు పాల్పడటం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేసి న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తెచ్చినట్లుగానే,
ఆంధ్రప్రదేశ్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు రాబోయే క్యాబినెట్ సమా వేశంలో దీనిపై నిర్ణయం తీసుకుని చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఉత్తరవల్లి మురళీ మెహన రావు,కృష్ణ రావు, శామ్యూల్, గాంధీ, కనపక సూర్యప్రకాష్,న్యాయవాదులు పాల్గొన్నారు.




