Kothapeta: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి గొల్లపల్లి అమూల్య పూజలు
Kothapeta: కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కొలువై ఉన్న ప్రసిద్ధ శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి.
Kothapeta: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి గొల్లపల్లి అమూల్య పూజలు
కొత్తపేట: నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రాజోలు నియోజకవర్గ ఇన్చార్జి గొల్లపల్లి అమూల్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమూల్య మాట్లాడుతూ..తను ఇంచార్జి గా ఉన్న రాజోలు నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖశాంతులతో, పాడిపంటలతో, అష్టైశ్వర్యాలతో సుభిక్షంగా ఉండాలని శ్రీ వెంకన్న స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ భూపతిరాజు ఈశ్వరరాజు వర్మ , వాడపల్లి దేవస్థానం చైర్మన్ గబ్బర్ సింగ్ మరియు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Next Story




