Kalyandurg: ఎన్‌టీఆర్ కాలనీలో పోలీసుల జల్లెడ.. అక్రమార్కులకు హెచ్చరిక

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో 'ఆపరేషన్ వజ్రప్రహార్' పేరుతో పోలీసులు భారీ తనిఖీలు నిర్వహించారు.

P.Sudhakar, Anantapuram
Published on: 11 April 2026 8:22 PM IST
Kalyandurg
X

Kalyandurg: ఎన్‌టీఆర్ కాలనీలో పోలీసుల జల్లెడ.. అక్రమార్కులకు హెచ్చరిక

Kalyandurg: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో పోలీసులు ‘ఆపరేషన్ వజ్రప్రహార్’ కార్యక్రమాన్ని చేపట్టి విస్తృత తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్‌టీఆర్ కాలనీలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా పాత నేరస్తులు, అక్రమంగా మత్తు పదార్థాలు విక్రయిస్తున్న అనుమానితుల నివాసాల్లో తనిఖీలు చేపట్టారు. కాలనీవాసులకు మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై పోలీసులు అవగాహన కల్పించారు.

అలాగే పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా మైనర్లు వాహనాలు నడపడం, త్రిబుల్ రైడింగ్, మొబైల్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలను వివరించారు.

తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలు, మూడు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ హరినాథ్, రూరల్ సర్కిల్ సిఐ నీలకంఠ, కుందుర్పి, కంబదూరు ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

P.Sudhakar, Anantapuram

P.Sudhakar, Anantapuram

Next Story