Nellore: మొక్కల పెంపకంలో అవినీతా? నిరూపిస్తే రాజీనామా!
Nellore: నెల్లూరు కార్పొరేషన్‌లో మొక్కల పెంపకంపై అవినీతి జరిగిందన్న వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలను డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఖండించారు.
Nellore: మొక్కల పెంపకంలో అవినీతా? నిరూపిస్తే రాజీనామా!
Nellore: కార్పొరేషన్ పరిధిలో నాటే ఒక్కో మొక్కకు 12 వేలు వెచ్చించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని, పచ్చదనం కోసం మొక్కలు నాటిస్తుంటే ఓర్వలేక వైసిపి జిల్లా ఇన్చార్జ్ పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్.
12 అడుగుల ఒక్కో మొక్కకు సంరక్షణతో కలిపి 4 వేలు మాత్రమే ఖర్చు చేస్తున్నామని, ఎమ్మెల్సీ చేసిన ఆరోపణలు అవాస్తవమని నిరూపించేందుకు నేను సిద్ధం అని చెప్పారు. తాను నిరూపించ లేకపోతే డిప్యూటీ మేయర్ పదవికి రాజీనామా చేస్తానని, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.
లేదంటే మీ ఆరోపణలు తప్పవని ఒప్పుకుని, మంత్రి నారాయణకి క్షమాపణలు చెప్పండి అంటూ డిమాండ్ చేశారు. సిటీలో వందల కోట్ల నామినేటెడ్ పనులు జరిగాయని చేసిన ఆరోపణలో నిజం లేదని చెప్పారు. రూ 50 కోట్ల నామినేషన్ వర్కులు జరిగినట్టు నిరూపించగలరా? అంటూ ప్రశ్నించారు. మున్సిపల్ చట్టం ప్రకారమే పన్నుల వసూలు జరుగుతోందని తెలిపారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రుక్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ. నెల్లూరు నగరపాలక సంస్థలో మొక్కల పెంపకం పేరుతో భారీగా అవినీతి జరిగిందంటూ ప్రతిపక్ష వైసిపి సిటీ ఇంచార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి నిన్న చేసిన ఆరోపణలపై, తీవ్రంగా స్పందించారు నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. మంత్రి నారాయణ ఆయన అనుచరులకు నామినేషన్ పద్ధతిలో కోట్లాది రూపాయల
ప్రజాధనం దోచి పెట్టారంటూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలను డిప్యూటీ మేయర్ తీవ్రంగా ఖండించారు. ఇందులో వాస్తవం లేదని రూప్ కుమార్ యాదవ్ అన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపణలు నిజమని తేలితే తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటాను. లేకపోతే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఏమి సమాధానం చెబుతారు అంటూ రూపు కుమార్ ప్రశ్నించారు. ఇవాళ జేమ్స్ గార్డెన్ లోనే తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రూపు కుమార్ యాదవ్ మాట్లాడారు.
ప్రతిపక్ష నేత చంద్రశేఖర్ రెడ్డి చేసిన ఆరోపణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ పరిధిలో ఒక్క మొక్క కోసం రూ.12000 వెచ్చించినట్లు నిరూపిస్తే తాము రాజకీయ సన్యాసం తీసుకుంటామన్నారు రూప్ కుమార్ యాదవ్. ఇందులో అవినీతి జరగలేదని నిరూపించేందుకు తాను సిద్ధం. మీరు అందుకు సిద్ధమా? అంటూ చంద్రశేఖర్ రెడ్డిని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. నగరపాలక సంస్థలో 12 అడుగుల మొక్క ఒక్కొక్కటి నాలుగు వేల రూపాయలు ఖర్చయిందన్నారు.మున్సిపల్ నిబంధనల ప్రకారమే నగరపాలక సంస్థలో పన్నుల వసూలు జరుగుతోందని రూప్ కుమార్ యాదవ్ చెప్పారు.




