Chandrababu: మంగళగిరిలో హ్యాండ్‌లూమ్ పార్క్.. చేనేతలకు సీఎం చంద్రబాబు వరాల జల్లు!
Chandrababu: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాలలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు.
Chandrababu: మంగళగిరిలో హ్యాండ్‌లూమ్ పార్క్.. చేనేతలకు సీఎం చంద్రబాబు వరాల జల్లు!
Chandrababu: దేశం గర్వించే గొప్ప కళ చేనేత కళ అని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి విశిష్టమైన కళలకు నిలయమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకుని బాపట్ల జిల్లా చీరాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మన నేత కార్మికులు అగ్గిపెట్టెలో పట్టేంత నైపుణ్యమైన చీరను సైతం తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారని గుర్తుచేశారు.
"ఒకప్పుడు చీరాల కర్చీఫ్‌లు ప్రపంచదేశాలకు ఎగుమతి అయ్యేవి. చీరాలను 'మినీ ముంబయి'గా పిలిచేవారు. రాష్ట్రంలో దాదాపు 1.27 లక్షల మంది కుటుంబాలు ఈ చేనేత రంగాన్నే నమ్ముకుని జీవిస్తున్నాయి. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చేనేత కార్మికులు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే అండగా నిలిచారు" అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇచ్చిన మాట ప్రకారం చేనేత కార్మికులకు సబ్సిడీపై విద్యుత్‌ను అందిస్తున్నాం. చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 50 ఏళ్లకే వయోపరిమితి తగ్గించి పింఛన్ అందిస్తున్నాం. మంగళగిరిలో ప్రత్యేకంగా హ్యాండ్‌లూమ్ పార్క్, ఉప్పాడలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టును వేగవంతం చేస్తున్నాం. చేనేతలకు చేదోడుగా రూ.25,000 ఆర్థిక సాయం అందజేస్తున్నాం. ప్రతి కుటుంబానికి రూ. 2.50 లక్షల విలువైన 'సంజీవని' ఆరోగ్య బీమాను కల్పిస్తున్నాం అని చంద్రబాబు తెలిపారు.
ఎన్డీయే ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు (బీసీలకు) ఎల్లవేళలా రుణపడి ఉంటుందని, రాబోయే రోజుల్లో వారి రుణం తప్పక తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎవరికీ ఇబ్బంది లేని సుపరిపాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు సవిత, గొట్టిపాటి రవికుమార్‌లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, చేనేత సంఘాల నాయకులు పాల్గొన్నారు.




