Nara Lokesh: పనిచేయని వారికి పదవులు ఊడతాయ్.. క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లకు మంత్రి లోకేష్ సీరియస్ వార్నింగ్!

Nara Lokesh: క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పనిచేయని వారి పదవులు ఊడతాయని హెచ్చరిస్తూ, 2027 కల్లా అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని స్పష్టం చేశారు.

Arun Chilukuri
Published on: 6 May 2026 6:49 AM IST
Nara Lokesh
X

Nara Lokesh: పనిచేయని వారికి పదవులు ఊడతాయ్.. క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లకు మంత్రి లోకేష్ సీరియస్ వార్నింగ్!

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌ల సమావేశంలో మంత్రి నారా లోకేష్ పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. పనిచేయని నాయకులను ఉపేక్షించే ప్రసక్తే లేదని, అహంకారం వీడి ప్రజల్లోకి వెళ్లాలని స్పష్టం చేశారు. వ్యక్తుల కంటే పార్టీయే శాశ్వతమని, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తే పదవులు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రభుత్వ కొనసాగింపు అత్యంత అవసరమని లోకేష్ పేర్కొన్నారు. ప్రతి ఓటును కీలకంగా పరిగణించాలని సూచిస్తూ.. పొరుగు రాష్ట్రం తమిళనాడులో కేవలం ఒక్క ఓటుతో గెలిచిన అభ్యర్థులు ఉన్నారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఓటర్లను గౌరవించాలని, సత్ప్రవర్తనతో మెలగాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు లోకేష్ తెలిపారు. 2027 లోపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తానని ఆయన ప్రకటించారు. ప్రతి కార్యకర్త బాధ్యతగా పనిచేసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story