Nara Lokesh: ప్రభుత్వ బడుల్లో స్మార్ట్ కిచెన్లు.. పేదలు బాగుపడితే జగన్‌కు ఎందుకు బాధ?

Nara Lokesh: ప్రభుత్వ బడుల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు రుచికరమైన భోజనం అందిస్తుంటే వైకాపా అధినేత జగన్ ఓర్వలేకపోతున్నారని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.

Arun Chilukuri
Published on: 28 Jun 2026 2:17 PM IST
Nara Lokesh
X

Nara Lokesh: ప్రభుత్వ బడుల్లో స్మార్ట్ కిచెన్లు.. పేదలు బాగుపడితే జగన్‌కు ఎందుకు బాధ?

Nara Lokesh: కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కిచెన్ల (Smart Kitchens) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఎంతో రుచికరమైన, నాణ్యమైన భోజనం పెడుతుంటే వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓర్వలేకపోతున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు ద్వారా మహిళలకు, పేదలకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తుంటే జగన్ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడిస్తూ... కడప జిల్లాలో ముందుగా 5 స్మార్ట్ కిచెన్లను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని మంత్రి తెలిపారు. దీని ద్వారా హెడ్ కుక్స్, అసిస్టెంట్ కుక్స్, హెల్పర్లు, మరియు డ్రైవర్లకు ఉపాధి లభించిందన్నారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, త్వరలోనే జిల్లా వ్యాప్తంగా మరో 33 స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేయబోతున్నామని, దీని ద్వారా అదనంగా 392 మందికి ఉపాధి లభిస్తుందని నారా లోకేశ్ స్పష్టం చేశారు.

స్మార్ట్ కిచెన్ల ద్వారా ఒకవైపు విద్యార్థులకు మేలు జరుగుతూ, మరోవైపు ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు ఉపాధి లభిస్తుంటే జగన్‌కు ఎందుకు బాధ కలుగుతోందని లోకేశ్ ప్రశ్నించారు. "పేద ప్రజలు బాగుపడితే మీరు చూడలేకపోతున్నారా?" అని ఆయన నిలదీశారు. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెస్తూ, విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్న తమ ప్రభుత్వంపై బురదజల్లడం మానుకోవాలని హితవు పలికారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story