Nara Lokesh: మహిళా ఎస్ఐపై వైసీపీ దాష్టీకం.. కఠిన చర్యలు తప్పవన్న నారా లోకేశ్!
Nara Lokesh: శ్రీకాకుళంలో మహిళా ఎస్ఐపై వైకాపా నాయకుల ప్రవర్తనపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం.
Nara Lokesh: మహిళా ఎస్ఐపై వైసీపీ దాష్టీకం.. కఠిన చర్యలు తప్పవన్న నారా లోకేశ్!
Nara Lokesh: చట్టాన్ని అతిక్రమించి విధుల్లో ఉన్న మహిళా అధికారిపై దాష్టీకానికి ఒడిగట్టిన వైసీపీ నాయకులపై కఠిన చర్యలు తప్పవని మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు. శ్రీకాకుళంలో విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐ (SI) పట్ల వైసీపీ నాయకులు ప్రవర్తించిన తీరు తీవ్ర ఆక్షేపణీయమని ఆయన మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వంలో మహిళల భద్రత, గౌరవంతో చెలగాటమాడితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని నారా లోకేశ్ స్పష్టం చేశారు. మహిళలను అవమానించడం, రాక్షస ఆనందం పొందడం వైసీపీ డీఎన్ఏలోనే ఉందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సొంత తల్లిని, చెల్లిని గెంటేసిన చరిత్ర జగన్ రెడ్డిదైతే.. సమాజంలో కనిపించిన ప్రతి మహిళను అవమానించడం వైసీపీ నాయకుల సంస్కృతిగా మారిందని లోకేశ్ ధ్వజమెత్తారు. విధుల్లో ఉన్న మహిళా పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామని మంత్రి తేల్చి చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.




