Nandikotkur: నందికొట్కూరులో కార్మికుల గర్జన.. జీతాల కోసం ఆందోళన బాట
Nandikotkur: నందికొట్కూరు మున్సిపల్ కార్మికుల సమస్యలపై సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో సమావేశం జరిగింది.
Nandikotkur: నందికొట్కూరులో కార్మికుల గర్జన.. జీతాల కోసం ఆందోళన బాట
Nandikotkur: నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపల్ కార్మికుల ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ జిల్లా కార్యదర్శి వై నరసింహులు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల జీతాలు గతంలో ప్రతి నెల ఒకటి రెండు తేదీలలో జీతాలు ఇచ్చేవారు కానీ నేడు 10వ తారీకు వచ్చినా జీతాలు అందనందు నందు వల్ల కార్మికులు ఆందోళనకు గురి అవుతున్నార న్నారు.
మరోపక్క నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి ఇంటి బాడుగల చెల్లించలేక ఆరోగ్యాల ఖర్చు. పిల్లల చదువుల ఖర్చులు విపరీతంగా పెరిగినందువల్ల, వాటి అవసరాలు తీర్చుట కొరకు వచ్చే అతి తక్కువ జీతం పై ఆధారపడుతున్నారు. నెల. నెల జీతాలు ఇవ్వకపోవడం వల్ల కార్మికుల కుటుంబాల అవసరాలు తీరక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం నోచుకోక తక్కువ వేతనాలతో పనులు చేస్తున్న కార్మికులకు నెల నెల జీతాలు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు.
కావున తక్షణమే 12వ పిఆర్సి కమిటీ వేసి వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా రిటైర్మెంట్ అయిన వారికి అన్ని బెనిఫిట్స్ ఇచ్చి వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని వారికి ఇవ్వాల్సిన అన్ని రకాల పనిముట్లు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని చెప్పి, రెండు సంవత్సరాలైనా నేటికీ పెంచకపోవడం దురదృష్టకరమన్నారు. ఒకపక్క దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కార్మిక వర్గానికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చినప్పటికీ నేటికీ ఎక్కడ కూడా అమలు చేయలేదు.
హైకోర్టు డివిజన్ బెంచ్ వివిధ ప్రభుత్వ శాఖల్లో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న వారందరినీ పర్మనెంట్ చేయాలని తీర్పు ఇవ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు కనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి వెంటనే పర్మినెంట్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అదేవిధంగా నందికొట్కూరు మున్సిపాలిటీలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న డైలీ వే జి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచాలని ఈ సందర్భంగా అధికారులను కోరారు .ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు పి మజీద్ మియా. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కే గోవిందు. కార్యదర్శి ఆర్ శేఖర్. కోశాధికారి తిమ్మన్న. కే అశోక్ కుమార్ .ఎం శ్రీనివాసులు. బాలాజీ. రాజశేఖర్ .సురేష్ తదితరులు పాల్గొన్నారు




