Naidupeta: అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం.. ఎంపీపీ ధనలక్ష్మి
Naidupeta: నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. పదవీకాలం ముగిసిన సర్పంచులకు ఎంపీపీ ధనలక్ష్మి ఘనంగా సన్మానం చేశారు.
Naidupeta: అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం.. ఎంపీపీ ధనలక్ష్మి
Naidupeta: తిరుపతి జిల్లా నాయుడుపేట లని ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎంపీపి కురుగుండ ధనలక్ష్మి, ఎంపీడీవో సురేష్ బాబు లు మరియు నాయుడుపేట మండల భీమవరం సర్పంచ్ సూళ్లూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయ్ శ్రీ తల్లి సులూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం సతీమణి అమృత సరళ మరియు సర్పంచులు ఎంపీటీసీలు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమంలో సర్పంచులకు పదవీకాలం ఈనెల రెండవ తేదీతో ముగియడంతో వారికి ఘనంగా సన్మానం చేసే విధంగా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే ముందుగా సర్వసభ్య సమావేశమును జరిపి ఆయా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి అనంతరం ఈ సన్మాన కార్యక్రమం ఏరటు చేయడం జరుగుతుందని ఎంపీపీ ధనలక్ష్మి తెలియజేశారు, ఇద సంవత్సరాల సర్పంచుల పదవీకాలంలో సర్పంచులు వారి వారి పంచాయతీలలో అనేక కార్యక్రమాలను నిర్వహించి పంచాయతీల అభివృద్ధికి దోహదపడ్డారని గత ఐదేళ్ల ప్రభుత్వ కార్యక్రమాలతో సర్పంచులు పాల్గొనడం పంచాయతీల అభివృద్ధికి దోహదపడటం జరిగిందని ఎంపీపీ ధనలక్ష్మి తెలియజేశారు,
ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ మాట్లాడుతూ వేసవికాలం కావడంతో ఎక్కడ నీటి కొరత ఏర్పడకుండా వాటర్ ట్యాంకులను మరియు కుళాయిలను నూతనంగానూ ఉన్న వాటిని నేలతో నింపడం గాని చేయడం జరుగుతుందని తెలియజేశారు, హౌసింగ్ ఏఈ శ్రీనివాసులు మాట్లాడుతూ ఇప్పటికే నాయుడుపేట మండలంలో నూతన ఇళ్ల నిర్మాణం కొరకు దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని త్వరలోనే లబ్ధిదారులకు ఎల్లను మంజూరు చేయడం జరుగుతుందని ఈ మధ్యకాలంలోనే ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమంలో ప్రజలకు ఈ విషయాన్ని తెలియజేయడం జరిగిందని ఆయన తెలియజేశారు,




