Mangalagiri: స్వర్ణాంధ్ర విజన్‌కు లీడర్షిప్ కాంక్లేవ్ ఊతం: శిరీషాదేవి!
Mangalagiri: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన లీడర్షిప్ కాంక్లేవ్‌లో రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి పాల్గొన్నారు.
Mangalagiri: స్వర్ణాంధ్ర విజన్‌కు లీడర్షిప్ కాంక్లేవ్ ఊతం: శిరీషాదేవి!
నాయకత్వ నైపుణ్యాల పెంపుకు ప్రజాక్షేత్రంలో మెరుగైన సేవలు అందించేందుకు నాయకత్వ శిక్షణా తరగతులు దోహదపడతాయని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్ ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గార్ల దిశానిర్దేశంలో లీడర్ షిప్ కాంక్లేవ్ నాయకత్వ శిక్షణా తరగతులు కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారి సౌజన్యంలో నిర్వహించిన సమావేశంలో తొలుత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నేడు, రేపు రెండు రోజులుపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ -2047 లో భాగంగా నియోజకవర్గాన్ని అని రంగాల్లో ముందుకు నడిపేందుకు ఈ శిక్షణ తరగతులు చాలా మంచిగా దోహదపడతాయని పేర్కొన్నారు. సమర్ధవంతమైన పాలన ప్రజా రంజక పాలన కేవలం కూటమితో మాత్రమే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో మరింత ఉత్సాహం గా ప్రజాక్షేత్రంలో ముందుకు సాగేందుకు ఈ కార్యక్రమం ఒక శక్తివంతమైన ఔషధం లాగా పనిచేస్తుందన్నారు.
కార్యక్రమంలో ఆమె పాల్గొని నియోజక అభివృద్ధికి తెదేపాతో నిర్ణయాలతోనే సరికొత్త అధ్యాయం రాబోతుందని అశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిపై రాసిన కథనానికి ఆయన్ని తెదేపా శ్రేణులు అభిందించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల పోలవరం జిల్లా ఇంచార్జి కుడిపూడి సత్తిబాబు, పొలిట్ బ్యూరో సభ్యులు , మంత్రులు , ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.




