Nellore: బారా షాహిద్ దర్గా ముఖద్వారాల ప్రారంభోత్సవం

Nellore: నెల్లూరు బారా షాహిద్ దర్గా ముఖద్వారాలను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ప్రారంభించారు.

V. Narasimhulu, Nellore
Published on: 10 April 2026 2:07 PM IST
Nellore
X

Nellore: బారా షాహిద్ దర్గా ముఖద్వారాల ప్రారంభోత్సవం

Nellore: సర్వమత సమ్మేళనానికి ప్రతీకగా. నెల్లూరు రొట్టెల పండుగకు ప్రసిద్ధిగాంచిన నెల్లూరు బారా షాహిద్ దర్గా ముఖద్వారాలు సర్వాంగ సుందరంగా రూపు దిద్దుకున్నాయి. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో 2 కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించిన బారాషహీద్ దర్గా ముఖద్వారాలను ప్రారంభించారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , యువనేత నారా లోకేష్ , మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ సహకారంతో బారాషహీద్ దర్గాను మరింతగా అభివృద్ధి చేస్తాం అని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

భవిష్యత్తులో బారా షాహిద్ దర్గా అభివృద్ధికి స్థానిక శాసనసభ్యుడిగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. 2014లో విపక్ష పార్టీ శాసనసభ్యుడిగా వేరే పార్టీలో ఉన్నా అభివృద్ధి విషయంలో. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎక్కడా రాజీ పడలేదని చెప్పారు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్.

కులాలకు మతాలకు అతీతంగా బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ జరుగుతుందని చెప్పారు అబ్దుల్ అజీజ్. గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బారా షాహీద్ దర్గా అభివృద్ధికి నిధులు ఇచ్చేందుకు గత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి మనస్సు రాలేదని చెప్పారు అబ్దుల్ అజీజ్. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, ముస్లిం నాయకులు మరియు ముస్లిం మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore

Next Story