Markapuram: గజ్జలకొండ క్రీడాకారుడిని అభినందించిన కలెక్టర్

Markapuram: మార్కాపురం మండలం గజ్జలకొండకు చెందిన నాసరయ్య థాయిలాండ్‌లో జరిగిన మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ, రజత పతకాలు సాధించారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత ఆయనను అభినందించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 30 April 2026 12:00 PM IST
Markapuram
X

Markapuram: గజ్జలకొండ క్రీడాకారుడిని అభినందించిన కలెక్టర్

మార్కాపురం జిల్లా: మార్కాపురం మండలం గజ్జలకొండ గ్రామానికి చెందిన యువకుడు జముళ్ళముడి నాసరయ్య అంతర్జాతీయ వేదికపై ప్రతిభ చాటాడు. థాయిలాండ్‌లో నిర్వహించిన మాస్టర్స్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్–2026లో పాల్గొని ఒక గోల్డ్ మెడల్, ఒక సిల్వర్ మెడల్ సాధించి జిల్లా గర్వకారణంగా నిలిచాడు.ఈ సందర్భంగా నాసరయ్య జిల్లా కలెక్టర్ విజయ సునీతను మర్యాదపూర్వకంగా కలిసి తన విజయం గురించి వివరించారు. ఆయన సాధించిన మెడల్స్‌ను పరిశీలించిన కలెక్టర్ విజయ సునీత హర్షం వ్యక్తం చేస్తూ నాసరయ్యను అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో జిల్లా పేరు ప్రతిష్టలు పెంచినందుకు ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా నాసరయ్య మాట్లాడుతూ, భవిష్యత్తులో జరగనున్న క్రీడా పోటీలకు ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తే మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించేందుకు కృషి చేస్తానని కలెక్టర్‌ను కోరారు.జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నాసరయ్య విజయంతో గజ్జలకొండ గ్రామంతో పాటు మార్కాపురం ప్రాంతమంతా ఆనందోత్సాహాల్లో మునిగిపోయింది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM

Next Story