Tadigadapa: తాడిగడపలో అనుమతులు లేకుండానే భారీ నిర్మాణం?
Tadigadapa: పెనమలూరు నియోజకవర్గంలోని వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా భారీ అక్రమ నిర్మాణం జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
Tadigadapa: తాడిగడపలో అనుమతులు లేకుండానే భారీ నిర్మాణం?
Tadigadapa: కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ పరిధి డొంక రోడ్డు లో భారీ నిర్మాణం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. సంబంధిత మున్సిపల్ అనుమతులు, నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా కట్టడం జరుగుతోందా లేదా అనే అంశంపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
భారీ స్థాయిలో నిర్మాణ పనులు జరుగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవాలను వెల్లడించాలని స్థానికులు కోరుతున్నారు. నిర్మాణానికి అనుమతులు ఉన్నాయా? అనుమతించిన ప్లాన్‌కు అనుగుణంగానే నిర్మాణం జరుగుతోందా? సెట్‌బ్యాక్ నిబంధనలు పాటిస్తున్నారా? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో అనధికార నిర్మాణాలపై గతంలోనూ ఫిర్యాదులు, వార్తా కథనాలు వెలువడ్డాయి. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే ఆరోపణలపై అధికారులు స్పందించి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని అప్పట్లోనూ డిమాండ్లు వచ్చాయి.




