Kovvuru: కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిపోయిన పలు రైళ్ల రాకపోకలు

Kovvuru: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Arun Chilukuri
Published on: 11 Sept 2026 1:02 PM IST
Kovvuru
X

Kovvuru: కొవ్వూరులో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. నిలిచిపోయిన పలు రైళ్ల రాకపోకలు

Kovvuru Goods Train: తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎరువుల లోడుతో విజయవాడ వైపు వెళ్తున్న గూడ్స్ రైలు నాలుగో లైన్‌పై ఒక్కసారిగా పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలుకు చెందిన ఏకంగా 8 బోగీలు పట్టాలు తప్పడంతో ట్రాక్ పూర్తిగా దెబ్బతింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు సాగించాల్సిన పలు ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

ప్రమాద తీవ్రత దృష్ట్యా రైల్వే అధికారులు అప్రమత్తమై నర్సీపట్నం, తుని, అన్నవరం, నిడదవోలు, రాజమండ్రి స్టేషన్లలో రైళ్లను నిలిపివేశారు. ఉదయం 9.15 గంటలకు కొవ్వూరు స్టేషన్‌లోని రెండో ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కూడా అక్కడే నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విజయవాడ వైపు వెళ్లాల్సిన ప్రయాణికుల రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది మరియు రెస్క్యూ టీమ్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని పునరుద్ధరణ పనులను ముమ్మరం చేశాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.