రెండేళ్ల ఎన్డీఏ పాలనలో కొత్తపేట నియోజకవర్గ ప్రగతి అద్భుతం: ఎమ్మెల్యే బండారు సత్యానందరావు!
రెండేళ్ల ఎన్డీఏ పాలనలో కొత్తపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించిందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు.
ఆత్రేయపురం: రెండేళ్ల ఎన్డీఏ పాలనలో రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధించిందని, అభివృద్ధికి ప్రతీకగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందారని, తెలుగు ప్రజలందరూ అన్నగా పిలుచుకునే మహనీయుడు ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశంతోనే రాష్ట్రంలో సంక్షేమ పాలనకు పునాది పడిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు.ఆత్రేయపురం మండలం వాడపల్లి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత రెండేళ్ల ఎన్డీఏ పాలనలో కొత్తపేట నియోజకవర్గ స్థాయిలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు.
లొల్లలాకుల పునర్నిర్మాణం, వాడపల్లి దేవస్థానం అభివృద్ధి, గ్రామ, గ్రామాన రహదారులు,డ్రైనేజీల నిర్మాణం, దేవరపల్లి లో ఎం ఎస్ ఎం ఈ పారిశ్రామిక వాడ అభివృద్ధి, డ్రాగన్ పడవల పోటీలతో టూరిజం అభివృద్ధి, నూతన విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు తదితర అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.లొల్లలాకుల పునర్నిర్మాణం, వాడపల్లి దేవస్థానం అభివృద్ధి, గ్రామ, గ్రామాన రహదారులు,డ్రైనేజీల నిర్మాణం, దేవరపల్లి లో ఎం ఎస్ ఎం ఈ పారిశ్రామిక వాడ అభివృద్ధి, డ్రాగన్ పడవల పోటీలతో టూరిజం అభివృద్ధి, నూతన విద్యుత్ సబ్స్టేషన్ల ఏర్పాటు తదితర అన్ని అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రత పింఛన్లు, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు పథకం, అన్నదాత సుఖీభవ, మెగా డీఎస్సీ, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందిస్తున్న చేయూత మొదలైన సంక్షేమ పథకాల గురించి వివరించి, లబ్ధిదారుల అనుభవాలను తెలుసుకున్నారు. ఇటు సంక్షేమం, అటు అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తామన్నారు.




